వైసీపీ కార్యకర్తను బలితీసుకున్న నారా లోకేష్.. ఓటమి భయంతోనే ఇలా

-

లోక్సభ ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీకి ఓటమి భయం పట్టుకుంది.దీంతో టీడీపీ కేడర్ ను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు ఆపార్టీ నేతలు. ఓటమి భయంతో ఫ్రస్ట్రేషన్ కు గురవుతున్న నారా లోకేష్ ..వైసీపీ నేతలపై దాడులకు ఉసిగొల్పుతున్నారు.ఫలితంగా వైసీపీ నేతలపై దాడులకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ గూండాలు ఒక వైసిపి కార్యకర్తను పొట్టనబెట్టుకున్నారు. న్యాయంగా పోరాడలేని వాళ్లే హింసను నమ్ముకుంటారు అని అంటారు. ధర్మంగా గెలవలేని వాళ్లే తన క్యాడర్ను రెచ్చగొట్టి అవతలివాళ్ళమీద దాడులకు ఉసిగొల్పి రక్తపాతానికి కుట్రలు పన్నుతారు.

మూడు శాఖలకు మంత్రిగా చేసినా 2019 ఎన్నికల్లో ఓడిపోయిన లోకేష్ మళ్ళీ మంగళగిరిలో పోటీ చేస్తున్నారు. ఈసారి అక్కడ వైసిపి తరఫున బీసీ అభ్యర్థి లావణ్యను బరిలోకి దించడంతో లోకేష్ లో మళ్ళీ ఓటమి భయం పట్టుకుంది.దీనికితోడు సర్వేలు కూడా లోకేష్ ఓడిపోతారని తేల్చేశాయి.దీంతో ఫ్రేస్ట్రేషన్ కు గురైన వైసీపీ నేతలను టార్గెట్ చేసుకున్నారు.అందుకే ఇక ప్రజాస్వామాయబద్ధంగా ఎన్నికలకు వెళ్తే గెలిచేది లేదని అర్థం చేసుకున్న లోకేష్ ఏకంగా హింసకు దిగారు.

మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి సిఎస్ఆర్ కళ్యాణమండపం రోడ్ లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మేకా వెంకట్ రెడ్డి చుట్టూ బైకులతో రౌండ్లు వేస్తూ భయభ్రాంతులను గురిచేశారు.ఏమిటీ రౌడీయిజం అని ప్రశ్నించినందుకు మేకా వెంకట్ రెడ్డిని తెలుగుదేశం కార్యకర్తలు బైక్ తో గుద్ది వెళ్ళిపోయారు.ఈ ఘటనలో వెంకట్ రెడ్డి తలకు బలమైన గాయం అయింది. వెంటనే హాస్పిటల్ కు తరలించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు…వైద్యం చేయించారు .కోమాలోకి వెళ్లిన వెంకటరెడ్డి చికిత్స పొందుతూ మృతి చెందారు. చూసారా.. ఓటమి భయం… ఏమి చేయాలో తెలియని ఫ్రస్ట్రేషన్… లోకేష్ ను ఇలా హింసకు పురిగొల్పుతోంది.వీళ్ళు అధికారంలోకి వస్తే సామాన్యులకు రక్షణ ఉంటుందా ని ఏపీ ప్రజలు చర్చించుకుంటున్నారు.మున్ముందు ఈ టీడీపీ గూండాలు ఇంకెన్ని అరాచకాలు చేస్తారో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version