యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ) స్థాపించి నేటికీ సరిగ్గా 10 ఏళ్ళు. వైఎస్. రాజశేఖర్ రెడ్డి ఆకస్మిక మరణంతో పాటు ఆసమయంలో రాష్ట్రంలో ఏర్పడ్డ రాజకీయ పరిణామాలతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఎ్సార్సీపీకీ శ్రీకారం చుట్టారు. పార్టీ స్థాపించిన అనతి కాలంలోనే రాష్ట్రంలో అన్ని చోట్ల మంచి ఆదరణ లభించింది. వైఎస్ ఆర్ అభిమానులు జగన్ వెంట పార్టీకి అండగా నిలిచారు. అప్పటి వరకు కాంగ్రెస్ లో ఉన్న అగ్ర నేతలతో సహా చాలా మంది కార్యకర్తలు వైఎస్ మీదున్న అభిమానంతో వైసీపీలో జాయిన్ అయ్యారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పార్టీ స్థాపించిన రెండేళ్లకే రాష్ట్రంలో ఉపఎన్నికలు జరిగాయి. అప్పటికి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు వైఎస్ జగన్ అప్పట్లో టీడీపీ నీ మద్దతు కోరగా తెలుగుదేశం పార్టీ జగన్ కు మద్దతు ఇచ్చేందుకు నిరాకరించింది. ఆ సమయంలో జరిగిన ఉపఎన్నికల్లో ప్రధాన పార్టీ అయిన తెలుగుదేశం పార్టీకి ఊహించని విధంగా గట్టి పోటీ ఇచ్చింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.
ఆ దశలో జగన్ మోహన్ రెడ్డి దూకుడు చూసి దాదాపు రాష్ట్రంలో టీడీపీ కనుమరుగయ్యే పరిస్తితి ఏర్పడింది అని అనుకున్నారు అంతా. కానీ కొద్ది తేడాతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమి చవి చూసింది. అయిన కూడా ఎక్కడ కూడా నిరాశ చెందకుండా, పట్టు విడువకుండా పార్టీ కార్యకర్తలకు ఎప్పటకప్పుడు దిశా నిర్దేశం చేస్తూ, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపి పార్టీని ముందుకు నడిపించారు జగన్. ప్రత్యేకంగా వైఎస్ ఆర్ మరణానంతరం జగన్ చెప్పట్టిన ఓదార్పు యాత్రకు ప్రజల్లో మంచి ఆదరణ లభించింది.
ఈ యాత్ర విషయంలో జగన్ మోహన్ రెడ్డికి ఎదురైన క్లిష్ట పరిస్థితుల్లో తన తల్లి, చెల్లి అండగా నిలిచి ఈ యాత్రను ముందుకు నడిపించారు. జగన్ ఈ మధ్య కాలంలో దాదాపు 16 నెలలు జైల్లో గడిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన్ను నానా రకాల ఇబ్బందులు పెట్టింది. అయినా సరే జగన్ ఎక్కడా వెనక్కు తగ్గలేదు అప్పట్లో. ఇక జగన్ జైల్లో ఉన్న సమయంలో వైఎస్ షర్మిల పాదయాత్ర చేసారు. ఆ పాదయాత్ర తో వైసీపీ అధికారంలోకి వస్తుంది అని భావించారు. అయినా సరే అధికారంలోకి రాలేదు.
2014 ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలైంది. ఆ తర్వాత కీలక ఎమ్మెల్యేలు పార్టీ వీడారు. అయినా సరే జగన్ ఎక్కడా వెనక్కు తగ్గలేదు. ఆ తర్వాత టీడీపీ ప్రభుత్వ అవినీతి మీద ప్రజల్లోకి బలంగా వెళ్ళారు జగన్. ఇప్పుడు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఎన్నో ఇబ్బందులు పడ్డారు, ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చి ఇప్పుడు ప్రభుత్వాధినేత అయ్యారు. ఈ పదేళ్ళ కాలంలో ఏ యువనేత చూడని కష్టాలు జగన్ చూసారు. ఒకవైపు కేసులు మరో వైపు రాష్ట్రంలో బలమైన ప్రత్యర్ధి, ఇవన్ని వైసీపీని బాగా ఇబ్బంది పెట్టాయి.