వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాల్లో ఆ పార్టీ బలంగా ఉండేది.. ప్రతి ఎన్నికలోనూ వైసీపీ జెండానే రెపరెపలాడేది.. కానీ గత ఎన్నికల్లో కథ రివర్స్ అయింది.. రాష్ట్రవ్యాప్తంగా ఉండే రిజర్వడ్ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు దూసుకెళ్లారు..
ముఖ్యంగా మన్యం జిల్లాలో వైసిపి బోల్తా కొట్టింది.. దీంతో ఆ జిల్లాపై జగన్ సీరియస్ గా దృష్టి పెట్టారు.. పట్టు చేజారకుండా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.. ముఖ్య నేతలతో వరుస సమీక్షలు నిర్వహిస్తూ.. వారికి దిశ నిర్దేశం చేస్తున్నారు..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా ఉన్న జిల్లాలో కూటమి అభ్యర్థులు విజయం సాధించడంతో పార్టీ క్యాడర్ డీలాపడింది. దీంతో ట్రైబల్ జిల్లాలో ఫ్యాన్ కు వచ్చిన ట్రబుల్ని జగన్ గుర్తించారు.. ఒకప్పుడు తిరుగులేని ఆధిపత్యాన్ని కనపరిచిన ఆ పార్టీ.. గత ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని మూట కట్టుకోవడంపై ముఖ్య నేతలతో జగన్ సమీక్షలు నిర్వహిస్తున్నారు.. తిరిగి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు.
మన్యం జిల్లాలో అత్యధికంగా గిరిజనులు బీసీలు ఎక్కువగా ఉంటారు.. వీరు మొదటి నుంచి జగన్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉండేవారు.. అయితే గత ఎన్నికల్లో వారంతా కూటమి అభ్యర్థులకు మద్దతు తెలపడంతో.. వైసీపీ తరఫున బరిలోకి దిగిన బలమైన క్యాండిడేట్స్ ఘోరంగా ఓడిపోయారు.. కురుపాం నుంచి మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి, సాలూరు నుంచి మరో డిప్యూటీ సీఎం రాజన్న దొర, పాలకొండ నుంచి కళావతి, పార్వతీపురం నుంచి జోగారావులు ఓటమి చవిచూసారు.. దీంతో జిల్లాలో పార్టీ పరిస్థితులపై జిల్లా అధ్యక్షుడు పరీక్షిత్ రాజ్, జోనల్ ఇన్చార్జి బొత్స సత్యనారాయణ తో జగన్ ఇటీవల సమావేశం నిర్వహించారు.. పార్టీ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.. ఓటమికి గల కారణాలను విశ్లేషించారు..
హామీల అమలపై కూటమి ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీయాలంటూ ముఖ్య నేతలకు వైసీపీ అధినేత జగన్ సూచించారట.. ప్రభుత్వం చేసే చిన్నపాటి తప్పిదాన్ని సైతం ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని.. అదే సమయంలో పార్టీని బలోపేతం చేసుకోవాలని దిశా నిర్దేశం చేసినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు.. కేడర్ కి ఎలాంటి ఇబ్బంది వచ్చినా అండగా ఉండాలని.. ఆయన సూచిస్తున్నారట.. ఎన్నికల్లో అనూహ ఓటమి తర్వాత నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయిన జిల్లా క్యాడర్ కి జగన్ నిర్వహిస్తున్న మీటింగ్లో నూతన ఉత్సాహాన్ని ఇస్తున్నాయని నేతలు చర్చించుకుంటున్నారు..