విజయవాడ వైసీపీలో రచ్చ…డ్యామేజ్ తప్పదా!

-

మొన్నటివరకు విజయవాడ టీడీపీలో నేతల మధ్య ఆధిపత్య పోరు నడిచిన విషయం తెలిసిందే. అక్కడ ఎంపీ కేశినేని నాని, మరికొందరు టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఇలా టీడీపీలో ఓ వైపు రచ్చ నడుస్తుంటే..మరోవైపు వైసీపీలో కూడా రచ్చ మొదలైంది. టీడీపీ నేతలు పరోక్షంగా విమర్శలు చేసుకుంటే…వైసీపీ ఎమ్మెల్యేలు డైరక్ట్ గా బూతులు తిట్టుకున్నారు. తాజాగా విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభానుల మధ్య మాటల యుద్ధం జరిగింది.

తాజాగా విజయవాడ నగర వైసీపీ అధ్యక్షుడు బొప్పన భవకుమార్ పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. ఆ కార్యక్రమంలో వెల్లంపల్లి, సామినేనిలు తిట్టుకున్నారు. అలా తిట్టుకోవడానికి కారణం ఆకుల శ్రీనివాస్ అనే నాయకుడు. ఈ మధ్య సామినేని నియోజకవర్గ పనులపై జగన్‌ని కలిశారు. ఈ క్రమంలోనే తన కుమార్తె వివాహ ఆహ్వాన పత్రికని జగన్‌కు ఇవ్వడానికి ఆకుల శ్రీనివాస్ అక్కడకు వచ్చారు. దీంతో సామినేని..ఆకులని వెంటబెట్టుకుని జగన్‌ని కలిశారు.

ఇక ట్విస్ట్ ఏంటంటే ఆకులది విజయవాడ వెస్ట్..పైగా 2014లో ఆయన విజయవాడ వెస్ట్ లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అప్పుడు వెల్లంపల్లి బి‌జే‌పి నుంచి ఓడిపోయారు. తర్వాత వెల్లంపల్లి వైసీపీలోకి వెళ్ళి గెలిచిన విషయం తెలిసిందే. ఇటు ఆకుల కూడా వైసీపీకి మద్ధతుగా ఉంటున్నారు. అయితే ఆకులతో వెల్లంపల్లికి సఖ్యత లేదు. దీంతో తన నియోజకవర్గానికి చెందిన ఆకుల శ్రీనివాస్‌ని వెంటబెట్టుకుని జగన్ వద్దకు ఎందుకు తీసుకెళ్లరంటూ వెల్లంపల్లి..సామినేనిని…బొప్పన పుట్టిన రోజు వేడుకల్లో ప్రశ్నించారు. నువ్వు ఏమైనా పోటుగాడివా అంటూ సామినేనిపై వెల్లంపల్లి ఫైర్ అయ్యారు.

దీంతో సామినేని కూడా పార్టీలో సీనియర్ లీడర్‌ని అని, నీకు మాదిరిగా మూడు పార్టీల మార్చలేదని, ఊసరవెల్లిని కాదని, నోరు అదుపులో పెట్టుకోవాలని సామినేని..వెల్లంపల్లికి వార్నింగ్ ఇచ్చారు. అలా ఇద్దరు నేతల మధ మాట మాట పెరిగడంతో ఇతర నేతలు..వారిని పక్కకు తీసుకెళ్లిపోయారు. అయితే సామినేని క్యాస్ట్ కాపు, వెల్లంపల్లి క్యాస్ట్ వైశ్య. ఆ గొడవ సమయంలో సామినేనిని ఉద్దేశించి వెల్లంపల్లి కాపు రౌడీలు అన్నారని, అందుకు క్షమాపణ చెప్పాలని కాపునాడు డిమాండ్ చేస్తుంది.

అయితే సామినేని ఉన్న జగ్గయ్యపేటలో వైశ్య ఓటింగ్ ఎక్కువే..ఇటు వెల్లంపల్లి ఉన్న విజయవాడ వెస్ట్ లో కాపు ఓటింగ్ ఎక్కువే. ఈ గొడవ వల్ల రెండు చోట్ల వైసీపీకి డ్యామేజ్ జరిగేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version