బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు రావాలని పొంగలేటి శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం ఇరిగేషన్ శ్వేత పత్రం మీద అసెంబ్లీలో చర్చ జరిగింది ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడారు గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టులను తొందరగా కట్టాలన్న ఆతృత తప్ప నాణ్యత గురించి పట్టించుకోలేదని పొంగులేటి అన్నారు.
ఉమ్మడి ఏపీలో తెలంగాణకి తీవ్ర అన్యాయం జరిగిందని అందుకని ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం జరిగిందని అన్నారు కానీ తెలంగాణ వచ్చాక కూడా తెలంగాణకి నీళ్ల విషయంలో అన్యాయం జరిగిందని అన్నారు మొత్తం కాలేశ్వర ప్రాజెక్ట్ ని తానే రూపశిల్పి అని కేసీఆర్ ఎన్నోసార్లు చెప్పుకున్నారు అటువంటి భారీ ప్రాజెక్టుల రూపశిల్పి ఇరిగేషన్ పై చర్చ సందర్భంగా సభకి వచ్చి ఎందుకు వివరణ ఇవ్వట్లేదని నిలదీశారు.