కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ కౌన్సిలర్..!

-

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ 24వ వార్డ్ బీఆర్ఎస్ పార్టీ కి చెందిన కౌన్సిలర్ జిర్కోని బాలరాజ్ శనివారం అసెంబ్లీ వద్ద ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మాల్ రెడ్డి రంగారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో చైర్మన్ కప్పరి స్రవంతి చందు పై అవిశ్వాస పరీక్ష వేయడంతో బాలరాజ్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు అదే బాట లో మరి కొంత మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ లో చేరేందుకు చూస్తున్నట్లు తెలుస్తోంది. పంది శంకరయ్య బాలరాజ్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీకి గట్టి దెబ్బ తగిలింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version