మరో వివాదంలో పూనం పాండే..అశ్లీల వీడియో చిత్రీకరిస్తూ…!

-

మోడల్, నటి పూనమ్ పాండే మరో వివాదంలో చిక్కుకుంది. ఓ అసభ్య వీడియో కారణంగా ఆమెపై గోవాలోని కనకోవా పోలీసులు కేసు నమోదు చేశారు. గోవాలోని చపోలి బ్రిడ్జి వద్ద పూనమ్ అశ్లీల వీడియోను రూపొందించింది. దీంతో ఆ డ్యామ్ పవిత్రతను, గోవా సంస్కృతిని దెబ్బతీసేలా పూనం ప్రవర్తించిందని ఫార్వర్డ్ పార్టీ మహిళా విభాగం ఫిర్యాదు చేసింది. పూనమ్‌తోపాటు ఆ వీడియోను చిత్రీకరించిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

పూన‌మ్ లాక్‌డౌన్‌లో త‌న ప్రియుడు సామ్‌బాంబేను పెళ్లి చేసుకున్నారు. సెప్టెంబ‌ర్ 1న‌ వైవాహిక జీవితాన్ని మొద‌లు పెట్టిన ఆమె భ‌ర్త‌ వేధిస్తున్నాడంటూ అదే నెల‌లో కేసు పెట్టారు. దీంతో గోవా పోలీసులు సెప్టెంబ‌ర్ 22న సామ్‌బాంబేను అరెస్టు చేయ‌గా మ‌రుస‌టి రోజే అత‌డికి బెయిల్ మంజూరైంది. ఇది జ‌రిగిన వారం రోజుల‌కే పూన‌మ్‌ మ‌న‌సు మార్చుకుని అతనితో కలిసున్నారు..

Read more RELATED
Recommended to you

Exit mobile version