మీ కోసం స్కీం అందుబాటులో ఉంచింది పోస్టాఫీస్. ఈ స్కీంను పొందాలి అనుకుంటే మీరు ఇందులో భాగస్వాములవ్వాలి.
బ్యాంక్ లో డబ్బులను ఫిక్స్ డ్ డిపాజిట్ రూపంలో లేక స్మాల్ సేవింగ్స్ స్కీంలో డబ్బులు పెట్టొచ్చు. రిస్క్ లేకుండా ఆకర్షణీయమైన రాబడిని మీరు పొందొచ్చు. ఇలాంటి స్కీం ఇప్పడు పోస్టాఫీస్ కిసాన్ వికాస్ పత్ర (కేవీపీ) పథకంలో కూడా అమలవుతోంది.
ఈ పథకంలో చేరిన కస్టమర్లు ఆకర్షణీయమైన రాబడిని పొందవచ్చు. 124 నెలల వరకు ఈ స్కీం కొనసాగుతుందని, కాలపరిమితి ముగిసిన తర్వాత వీరు చెల్లించిన డబ్బుకు రెట్టింపును పొందవచ్చు. గతంలో ఈ స్కీంలో డబ్బులు 113 నెలల్లో డబుల్ అయ్యేది. అయితే కేంద్రం స్మాల్ సేవింగ్ స్కీం వడ్డీ రేట్లు తగ్గించింది. కేవీపీ వడ్డీ రేట్లు తగ్గడంతో ఈ స్కీంను 124 నెలలకు పెంచింది. ప్రస్తుతం కేవీపీ స్కీం ద్వారా 6.9 శాతం వడ్డీ పొందొచ్చు. 18 ఏళ్లకు పైన వయస్సు కలిగిన భారతీయులు ఎవరైనా కేవీపీలో చేరవచ్చు. ఈ పథకంలో చేరాలంటే కనీసం రూ.1000 పెట్టుబడి పెట్టాలి. కొత్త వడ్డీ రేట్ల ప్రకారం.. రూ. లక్ష పెడితే.. మెచ్చూరిటీ సమయంలో రూ.2 లక్షలు తీసుకోవచ్చు. స్కీంలో నామినీ సదుపాయం, ఒకరి పేరుపై నుంచి మరొకరి పేరుపై పత్రాల మార్పిడి సదుపాయం కలదు.