చాలా మంది వారికి నచ్చిన స్కీమ్స్ లో డబ్బులు పెడుతూ వున్నారు. భవిష్యత్తు అవసరాల కోసం చాలా మంది వాళ్లకి నచ్చిన స్కీమ్స్ లో డబ్బులు పెడుతున్నారు. పైగా ట్యాక్స్ బెనిఫిట్స్ ని కూడా పొందొచ్చు. ఇక మరి పోస్ట్ ఆఫీస్ అందించే ఆ స్కీమ్ కోసం పూర్తి వివరాలని చూద్దాం.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్:
పోస్టాఫీస్ అందించే స్కీమ్స్ లో ఇది కూడా ఒకటి. ఈ స్కీమ్ లో డబ్బులు పెట్టడం వలన అదిరే లాభాలని పొందేందుకు అవుతుంది. 15 ఏళ్ల మచ్యురిటీ పీరియడ్ వుంది. 7.1 శాతం వడ్డీ రేటును ఈ స్కీమ్ కింద వస్తుంది. ఈ స్కీమ్ లో మీరు ఏడాదికి రూ.500 నుంచి గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకు జమ చేయవచ్చు. రూ.1.5 లక్షల వరకు పొదుపు నగదుకు సెక్షన్ 80సీ ప్రకారం ట్యాక్స్ బెనిఫిట్స్ ని పొందొచ్చు.
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్:
ఇది కూడా మంచి స్కీమ్. 7 శాతం వడ్డీ ఈ స్కీమ్ కింద వస్తుంది. కనిష్ఠంగా రూ.100 నుంచి ఈ స్కీమ్ లో డబ్బులు పెట్టచ్చు. ఎలాంటి గరిష్ఠ పరిమితి లేదు. ఆర్థిక ఏడాదిలో రూ.1.5 లక్షల వరకు ట్యాక్స్ బెనిఫిట్స్ పొందొచ్చు.
సుకన్య సమృద్ధి యోజన:
సుకన్య సమృద్ధి యోజన ద్వారా 7.6 శాతం వడ్డీ వస్తోంది. ఏడాదికి కనిష్ఠంగా రూ.250 పొదుపు చేయాల్సి ఉంటుంది. గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకు పెట్టచ్చు.
ఐదు ఏళ్ల టైమ్ డిపాజిట్ స్కీమ్:
ఏడాదికి రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ప్రయోజనాలు లభిస్తాయి. కనీసం రూ.1000 నుంచి డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. గరిష్ఠ పరిమితి ఏమీ లేదు.
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్:
60 ఏళ్లు ఆపై వయసు పైబడిన వాళ్ళు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ లో డబ్బులు పెట్టచ్చు. 8 శాతం వడ్డీ రేటు వస్తుంది.