పోస్టాఫీసు సూపర్ స్కీమ్ ..రూ.299 తో రూ.10 లక్షలు పొందే అవకాశం..పూర్తి వివరాలు..

-

పోస్టాఫీసులో ఎన్నో పొదుపు పథకాలు అందుబాటులో ఉన్నాయి.ఇందులో డబ్బులు ఇన్వెస్ట్ చెయ్యడం వల్ల సేఫ్ మరియు మంచి లాభాలను పొందవచ్చు.ఆరోగ్య భీమా పథకాలకు మంచి డిమాండ్ ఉంది.ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌ ప్రత్యేక యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకొచ్చింది. ఈ గ్రూప్ యాక్సిడెంటల్ పాలసీ కోసం టాటా AIGతో కలిసి పని చేస్తోంది. ఇందులో సంవత్సరానికి రూ. 299, రూ. 399 ప్రీమియంతో రూ. 10 లక్షల బీమా పొందవచ్చు. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఖాతాదారులకు ఈ పథకం అందుబాటులో ఉంటుంది..

ఈ పథకం కింద IPD ఖర్చుల కోసం రూ. 60 వేలు, ప్రమాదవశాత్తు గాయం అయితే OPD కోసం రూ. 30 వేలు ఇస్తారు. మరోవైపు ప్రమాదవశాత్తు మరణిస్తే బాధిత కుటుంబాలకు రూ.10 లక్షలు పరిహారంగా అందజేయనున్నారు. ఆధారపడిన ఇద్దరు పిల్లల చదువుల కోసం రూ.1 లక్ష అందిస్తుంది.ట్రావెల్ చార్జెస్ ను కూడా అందిస్తుంది.ప్రమాదంలో పాలసీదారుడు అంగవైకల్యం పొందితే.. ఖాతాదారునికి రూ.10 లక్షల పరిహారం అందుతుంది. ఖాతాదారుడు ప్రమాదంలో మరణిస్తే అంత్యక్రియల కోసం ఆధారపడిన వారికి రూ. 5000 సహాయం, పిల్లల చదువు కోసం రూ. 1 లక్ష పరిహారాన్ని అందిస్తుంది.

299,399 పాలసీల పూర్తీ వివరాలు..

రూ.299 పాలసీ..

ఈ ప్రమాద రక్షణ పథకం కింద పాలసీ తీసుకున్నా, రూ.399 ప్రమాద రక్షణ పథకంలో ఇస్తున్న అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. కానీ, ఈ రెండు పథకాల మధ్య ఒకే ఒక్క తేడా ఏమిటంటే.. రూ.299 ప్రమాద రక్షణ పథకంలో మరణించిన వారిపై ఆధారపడిన వారి పిల్లల చదువుకు సహాయం మొత్తం అందుబాటులో ఉండదు..

రూ.399 పాలసీ..

ఈ పథకం కింద పాలసీదారు మరణిస్తేరూ. 1000000, అంగ వైకల్యం వస్తే రూ.1000000,వైద్య ఖర్చులు IPD: రూ.60,000లోపు,ప్రమాదవశాత్తు వైద్యఖర్చుల OPD రూ. 30,000లలోపు..విద్యా ప్రయోజనాలు SIలో 10% లేదా రూ. 100000, ఆసుపత్రిలో రోజువారీ నగదు10 రోజుల వరకు రోజుకు రూ.1000లు అందజెస్తారు. కుటుంబ రవాణా ప్రయోజనం రూ. 25000 లేదా అసలు ఏది తక్కువైతే అది..అంత్యక్రియల కోసం రూ. 5000 లను అందిస్తారు..

Read more RELATED
Recommended to you

Exit mobile version