ఏపీలో విద్యుత్ కోతలు ఉంటాయి : మంత్రి బాలినేని

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజుల నుంచి విద్యుత్ కోతలు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఏపీ గ్రామాల్లో ఎక్కువగా విద్యుత్ కోతలు చోటుచేసుకుంటున్నాయి. ప్రతిరోజు రెండు గంటల నుంచి మూడు గంటల వరకు విద్యుత్ కు అంతరాయం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలోనే విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ కీలక ప్రకటన చేశారు.

ఏపిలో చిన్నచిన్న విద్యుత్ కోతలు ఉన్నాయని.. ఇక ముందు కూడా కొని చోట్ల ఉంటాయని ప్రతి పక్ష పార్టీ దాన్ని పెద్దవి చేసి చూపిస్తున్నారని తెలిపారు విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. గత ప్రభుత్వం వేల కోట్లు అప్పులు చేసి వెళ్లడంతో ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు.

శ్రీకాకుళం జిల్లాలో వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగించడం వలన రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి ఏపిని విభజించారని…విభజన హామీలు అమలు చెయ్యాల్సిన బాధ్యత బీజేపీపై ఉందని పేర్కొన్నారు. డీజీపిగా సవాంగ్ రెండున్నరేళ్లు పని చేశారు..ఆయనకి ఇప్పుడు కూడా మంచి పోస్ట్ ఇచ్చారన్నారు విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version