ఏడుస్తున్న “పవర్ స్టార్” : “ఫ్రీ” షో చూయించిన వర్మ..!

-

వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ తెరకెక్కిస్తున్న ‘పవర్ ‌స్టార్‌’ సినిమా ట్రైలర్ యూట్యూబ్‌లో లీకైంది. నాలుగు నిమిషాలు నిడివి కలిగిన ఈ ట్రైలర్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. దీనిపై స్పందించిన వర్మ..ప‌వ‌ర్‌ స్టార్ ట్రైల‌ర్ లీక్ కావ‌డం వ‌ల్ల గంటలో అఫీషియల్ వెర్షన్‌ను యూట్యూబ్‌లో విడుద‌ల చేస్తామన్నారు. అంతేకాకుండా ట్రైల‌ర్‌కి డ‌బ్బులు క‌ట్టిన వారికి తిరిగి చెల్లిస్తామ‌ని ఆయన ట్వీట్ చేశారు. ఇక ట్రైలర్ విషయానికొస్తే.. వర్ స్టార్ ట్రైలర్‌ లో పవన్ కళ్యాణ్‌ను ప్రవన్ కళ్యాణ్‌గా పేరు మార్చారు వర్మ.

ఆయన ఫామ్ హౌస్‌లో ఏం చేస్తుంటారనే విషయంతో ట్రైలర్ ప్రారంభించిన వర్మ.. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు అంటూ రచ్చ మొదలుపెట్టారు. ముఖ్యంగా చిరంజీవిలా కనిపిస్తున్న ఓ వ్యక్తి సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్న క్యారెక్టర్‌తో మాట్లాడుతూ.. నీ గుండెలా మీద చేయేసుకుని చెప్పరా.. నువ్వు పవర్ స్టార్ అయ్యింది.. కానిస్టేబుల్ కొడుకు గాన లేఖ నా తమ్ముడి గాన అనే డైలాగ్ పేలుతోంది.. ఇంకా ఇలాంటీవి రెండు మూడు ఉన్నాయి. ఇక పవర్ స్టార్ సినిమా ఈ నెల 25న ఆర్జీవీ వరల్డ్‌ థియేటర్‌లో విడుదలకానున్నట్లు ప్రకటించాడు వర్మ.

Read more RELATED
Recommended to you

Exit mobile version