నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వానికి బిగ్ షాక్ తగిలింది. ఆయనను ఎస్‌ఈసీగా కొనసాగించాలని ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. హైకోర్టు తీర్పు ప్రకారం ఎస్‌ఈసీగా నిమ్మగడ్డను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఈ మేరకు లేఖ రాసినట్లు సమాచారం. రెండు రోజుల తర్వాత నిమ్మగడ్డను ఎస్‌ఈసీగా కొనసాగించాలని జగన్ సర్కార్‌ను హరిచందన్ ఆదేశించారు.
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో సోమవారం రోజు మాజీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ సమావేశమయ్యారు. తనను ఎస్‌ఈసీగా పునర్నియామకం చేయాలంటూ గవర్నర్‌కు వినతి పత్రం అందజేశారు. హైకోర్టు తీర్పుతో పాటూ మిగిలిన అంశాలపై గవర్నర్‌తో చర్చించారు. మరి గవర్నర్ తీర్పుపై సీఎం జగన్ సర్కార్ ఎలా స్పందించబోతుంది అనేది ఆసక్తిగా మారింది.