టాలీవుడ్ బాహుబలి ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా “ప్రాజెక్ట్ కె”, ఈ సినిమాకు సంబంధించి ఇంకా ఎటువంటి అప్డేట్ రాకుండానే ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఇందులో ప్రభాస్, దీపికా పదుకునే, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ లాంటి పేరు మోసిన స్టార్లు నటిస్తున్నారు. కాగా తాజాగా ప్రాజెక్ట్ కె నుండి ఒక అమేజింగ్ అప్డేట్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఒకరోజు ముందుగా ఈ సినిమాలో నటిస్తున్న దీపికా పదుకునే ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన చిత్ర బృందం.. ఇప్పుడు ప్రభాస్ ఫస్ట్ లుక్ ను విడుదల చేసి అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చింది. ఈ లుక్ లో ప్రభాస్ ఒక ఇండియన్ సూపర్ హీరోలా ఉన్నదంటూ అభిమానులు ఎంతగానో సంతోషంలో మునిగితేలుతున్నారు. హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కుతోందని చెప్పిన చిత్ర బృందం ఫస్ట్ లుక్ లో అదే విధంగా ఉండేలా జాగ్రత్త పడింది.
“ప్రాజెక్ట్ కె” అమేజింగ్ అప్డేట్: ఇండియన్ సూపర్ హీరోలా ప్రభాస్… !
-