కాఫీ విత్​ కరణ్​ షోలో ప్రభాస్​… ఆ హీరోయిన్​ కోసం!

-

బాలీవుడ్ నిర్మాత కాఫీ విత్ కరణ్ 7 షో ఎంతగా పాపులర్ అయ్యిందో తెలిసిన విషయమే. ఇటీవల సమంత, విజయ్ దేవరకొండ వంటి సౌత్ సెలబ్రెటీలు పాల్గోన్న ఈ షో దక్షిణాదిలోనూ ఆదరణ పొందింది. ఇందులో కరణ్ సెలబ్రెటీల సినిమా అప్డేట్స్ మాత్రమే కాకుండా.. వారి వ్యక్తిగత విషయాల గురించి పలు ప్రశ్నలు అడుగుతూ నెట్టింట హాట్ టాపిక్ అయ్యారు.

కాఫీ విత్ కరణ్ షో

తాజాగా ఈషోలో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్, హీరో టైగర్ ష్రాఫ్ పాల్గొన్నారు. వీరిద్దరి ఎపిసోడ్‏కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో రాపిడ్ ఫైర్ రౌండ్‏లో భాగంగా వారి కోస్టార్స్‏లలో ఒకరికి కాల్ చేయాలని కరణ్ సూచించారు. దీంతో కృతి సనన్.. తన కోస్టార్ ప్రభాస్‏కు కాల్ చేసింది. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

కాఫీ విత్ కరణ్ షో

అందులో కృతి సనన్ ప్రభాస్‏కు కాల్ చేసి.. హే కరణ్.. ఇది నేనే అని చెప్పమని కోరడంతో ప్రభాస్ అలాగే చెప్పేశాడు.. దీంతో కృతి 2 పాయింట్స్ గెలుచుకుంది. వెంటనే తన కాల్ లిఫ్ట్ చేసిన యంగ్ రెబల్ స్టార్‏కు ధన్యవాదాలు తెలుపుతూ.. మీరు అమెజింగ్ అని తెలిపింది. షో తర్వాత మిమ్నల్ని కలుస్తాను అని కృతి చెప్పగా సరే జాగ్రత్త అంటూ సమాధానమిచ్చాడు ప్రభాస్. వీరిద్దరి సంభాషణ నెటిజన్లను ఆకట్టుకుంటుంది.

కాఫీ విత్ కరణ్ షో

Read more RELATED
Recommended to you

Exit mobile version