‘కన్నప్ప’ సెట్లో హీరో ప్రభాస్

-

గత కొన్ని సంవత్సరాలుగా హిట్ కోసం ప్రయత్నిస్తున్న మంచు విష్ణుకి సక్సెస్ అందకపోవడంతో ఈసారి ఎలాగైనా మంచి విజయాన్ని అనుకోవాలని భావిస్తున్నాడు.మహా భారతం సీరియల్‌ను తీసిన ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్ లో విష్ణు మంచు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం భక్త కన్నప్ప. మంచు విష్ణు కి ఇది డ్రీమ్ ప్రాజెక్ట్‌. పాన్ ఇండియా వైడ్‌గా రాబోతోన్న ఈ సినిమాని మోహన్ బాబు నిర్మిస్తున్నారు.ఇది వరకు ఎన్నడూ చూడని ఓ దృశ్యకావ్యంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం పై జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అంచనాలున్నాయన్న విషయం తెలిసిందే.

పాన్ ఇండియా వైడ్‌గా రాబోతోన్న ఈ మూవీలో అనేకమంది స్టార్ నటులు అతిథి పాత్రల్లో మెరవబోతున్నారు. ఇటీవల అక్షయ్ కుమార్ పాత్ర షూటింగ్ పూర్తవ్వగా తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ ‘కన్నప్ప’ సెట్లో అడుగు పెట్టారు. ‘మా బ్రదర్ షూటింగ్లో పాల్గొన్నారు’ అంటూ మంచు విష్ణు ఓ పోస్టర్ను విడుదల చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version