ప్రభాస్‌ అభిమానులకు అలర్ట్.. ప్రభాస్‌ అన్ స్టాపబుల్-2 ప్రొమో రిలీజ్‌

-

డార్లింగ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్న ప్రోమో వచ్చేసింది. నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే 2లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, అతని ప్రాణ స్నేహితుడు గోపిచంద్‏తో కలిసి సందడి చేశారు. దీనికి సంబంధించిన ఆసక్తికరమైన ప్రోమోను ఆహా యూట్యూబ్ లో విడుదల చేసింది. ఫుల్ ఎపిసోడ్ డిసెంబరు 30న ఆహా ఓటీటీ యాప్ లో ప్రసారం కానుంది.

Unstoppable Promo: Balayya and Darling promise unlimited fun - Cine Chit Chat

ఇక ప్రోమో చూస్తే… బాలకృష్ణ ఎప్పట్లానే తనదైన శైలిలో నవ్వుల జడివాన కురిపించారు. ప్రభాస్, గోపీచంద్ ఇద్దరూ మంచి స్నేహితులు కావడంతో కామెడీ బాగా వర్కౌటైంది. అరే, ఒరే అనుకుంటూ ఇద్దరూ తమ ఫ్రెండ్షిప్ ను ప్రదర్శించడం ఆకట్టుకుంది. అంతేకాదు, షో మధ్యలో రామ్ చరణ్ ఫోన్ చేసి ప్రభాస్ సీక్రెట్ ఒకటి బయటపెట్టగా… రేయ్ చరణూ… నువ్వు నా ఫ్రెండువా, శత్రువువా! అంటూ చిరుకోపం ప్రదర్శించారు.

బాలయ్య పెళ్లి మాటెత్తగానే… సల్మాన్ ఖాన్ తర్వాత చేసుకుంటానని ప్రభాస్ చమత్కరించారు. టాక్ షో ఆద్యంతం ఇలాంటి చమక్కులతో ఆడియన్స్ కు వినోదాల పండుగలా ఉంటుందని ప్రోమో చూస్తే అర్థమవుతోంది. ఇదిలా ఉంటే.. కేవలం 20 నిమిషాల్లోనే 3 లక్షల వ్యూస్‌లో ఈ ప్రొమో దూసుకుపోతోంది.

Unstoppable with NBK S2 - Prabhas & Gopichand Episode Promo | Premieres December 30 | ahaVideoIN

Read more RELATED
Recommended to you

Exit mobile version