ఆ హీరోయిన్ తో ప్రేమలో పడ్డ ప్రభాస్.. ఈసారైనా పెళ్లి వరకు వెళ్తుందా..?

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరు అంటే టక్కున గుర్తొచ్చే పేరు పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్. ఇక ఈయన తోటి నటులైన అల్లు అర్జున్ ఎన్టీఆర్ కూడా వివాహం చేసుకొని ఇద్దరేసి పిల్లలకు చొప్పున జన్మనిచ్చి వారు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటే ప్రభాస్ మాత్రం పెళ్లి అనే పదానికి దూరంగా ఉండిపోయారు. అటు కుటుంబ సభ్యులు ఇటు అభిమానులు కూడా ప్రభాస్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు అనే ఆందోళనను వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే గతంలో త్రిష తో ప్రేమలో పడ్డాడు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు అని వార్తలు వైరల్ అయ్యాయి.. ఆ తర్వాత అనుష్కతో ప్రేమలో పడ్డాడు.. పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వైరల్ అవ్వడం ఇప్పటికీ అది రుమార్ గానే మిగిలిపోయింది. నిజానికి అనుష్క కూడా వివాహానికి దూరం అవడంతో నిజంగానే వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు అంటూ వార్తలు బాగా ప్రచారం అవడం మరింత వివాదాలకు దారితీసింది.

ఇకపోతే తాజాగా ప్రభాస్ పై మరొక గాసిప్ వైరల్ అవుతోంది. ప్రభాస్ ఒక హీరోయిన్ తో ప్రేమలో పడ్డాడు అంటూ ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది ఆమె ఎవరో కాదు బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ తో ప్రేమలో పడ్డాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. అంతేకాదు అభిమానులు కూడా ఇదే వార్త నిజమైతే బాగుండు అని అనుకుంటున్నారు. చూడడానికి కూడా ఈ జంట ఎంతో చూడముచ్చటగా ఉంటుందని, నిజంగానే ఈ వార్తల్లో నిజం ఉంటే ప్రభాస్ ఒక ఇంటివాడు అవుతాడు అంటూ తమ ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉండడం..మరి ఇందులో ఎంత నిజం ముందో తెలియదు కానీ ప్రభాస్, కృతి సనన్ లో ఎవరో ఒకరు నోరు విప్పక తప్పదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version