జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఊసరవెల్లి అంటూ, సినీ నటుడు ప్రకాష్ రాజ్ విమర్శలు చేశారు. ప్రముఖ న్యూస్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ప్రకాష్ రాజ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపైనా, అనేక అంశాలపైనా ప్రకాష్ రాజ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కార్పొరేషన్ ఎన్నికల హడావుడి జరుగుతున్న నేపథ్యంలో ఆ అంశం పైన ప్రకాష్ రాజ్ స్పందించారు. బిజెపికి పవన్ మద్దతు పలకడం పై ప్రకాష్ రాజ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పవన్ తనను పూర్తిగా నిరాశ పరిచాడని, అతను ఒక నాయకుడు . అతనికి జనసేన అనే రాజకీయ పార్టీ ఉంది. అలాంటి పవన్ బిజెపి పంచన చేరడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ప్రకాష్ ప్రశ్నించారు. అసలు తెలుగు రాష్ట్రాలలో పవన్ పార్టీకి ఉన్న ఓటు బ్యాంకు ఏమిటని ? బిజెపి ఓటు బ్యాంక్ ఏమిటని ? కనీసం ఒక్క శాతం కూడా లేని బీజేపీతో పవన్ కళ్యాణ్ పొత్తు అవసరమా అంటూ ప్రశ్నించారు.
మొదటి నుంచి బిజేపి వైఖరిపై ప్రకాష్ రాజ్ ఇదే వైఖరితో ఉంటూ వస్తున్నారు. నోట్ల రద్దు వ్యవహారాన్ని సైతం ప్రకాష్ రాజ్ తప్పు పట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పవన్ పై ఈ విధంగా సంచలన ఆరోపణలు చేస్తూ టిఆర్ఎస్ కు అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం రాజకీయ సంచలనం సృష్టిస్తోంది. అయితే ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై జనసైనికులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు