మోహన్ బాబు, నరేష్ భౌతిక దాడులు చేశారు : ఎన్నికల అధికారికి ప్రకాష్ రాజ్ లేఖ

-

మా అసోసియేషన్ ఎన్నికల అధికారికి దిగ్గజ నటుడు ప్రకాష్ రాజ్ బహిరంగ లేఖ రాశారు. మా ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో జరిగిన వివాదం పై సి సి ఫుటేజ్ ఆధారాలు కావాలి అని లేఖలో డిమాండ్ చేశారు ప్రకాష్ రాజు. మా ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల పోలింగ్ సమయంలో… సీనియర్ నటుడు మోహన్ బాబు మరియు మాజీ అధ్యక్షులు నరేష్… తమ ప్యానల్ సభ్యులపై భౌతిక దాడులకు దిగడమే కాకుండా… నోటికొచ్చినట్లు తిట్టారని లేఖలో పేర్కొన్నారు ప్రకాష్ రాజ్.

ఎన్నికల అధికారి గా… మీరు తటస్థంగా ఉండి… ఆరోజు రికార్డు అయిన సీసీ ఫుటేజ్ త్వరగా తమకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై ఆలస్యం జరిగితే… ఆ సి సి ఫుటేజ్ రికార్డును డిలీట్ చేసే ప్రమాదం కూడా ఉందని పేర్కొన్నారు ప్రకాష్ రాజ్.

“ఓ ఎన్నికల అధికారిగా సంబంధిత రికార్డులను కనీసం మూడు నెలలపాటు భద్రపరచడం మీ బాధ్యత. సుప్రీంకోర్టు సైతం పలు తీర్పులో ఎన్నికలకు సంబంధించిన రికార్డులను పోలింగ్ ఆఫీసర్స్ జాగ్రత్త చేయాలని చెప్పింది. కాబట్టి వీలైనంత త్వరగా ఆ సీసీ ఫుటేజ్ ను మాకు ఇవ్వాలి. ఒకవేళ దీనిపై మీరు స్పందించకపోతే క్యాంపర్ అయిందని భావించాల్సి ఉంటుంది” అని లేఖలో పేర్కొన్నారు ప్రకాష్ రాజ్. అయితే ప్రకాష్ రాజ్ రాసిన ఈ లేకపోతే ఎన్నికల అధికారి ఎలా స్పందిస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version