MAA Elections: ఒక్కొక్క ల** కొడుకు సంగతి చూస్తా అన్నాడు.. న‌రేశ్ నిజ‌స్వ‌రూపాన్ని బ‌య‌ట‌పెట్టిన ఉత్తేజ్‌

-

MAA Elections: మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్ (మా)లో ఎన్నిక‌ల ఫలితాల తరువాత ఇండస్ట్రీలో ముసలం ఏర్పడింది. ఇండస్ట్రీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత ఎన్నిక‌ల‌తో పోల్చితే ఈ సారి ఎన్నికలు మరింత హీటెక్కించాయి. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మధ్య జరిగిన పోరులో చివరకు మంచు విష్ణు అధ్య‌క్ష పీఠం దక్కింది. మంచు విష్ణు చేతిలో ఘోర పరాజయాన్ని చవి చూసిన ప్రకాష్ రాజ్ కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ప్ర‌కాశ్ రాజ్ ప్యానల్ లోని స‌భ్యులు వ‌రుస‌గా రాజీనామాలు చేస్తూ మీడియా వ‌చ్చారు. ఈ క్ర‌మంలో ఒక్కక్కరిగా మాట్లాడుతూ తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ వచ్చారు. ఈ త‌రుణంలో నరేష్‌ పై ఉత్తేజ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

”సినిమా అనేది లోకల్, నాన్ లోకల్ ఇష్యూ కాదు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి.. ఈ క‌ళామాతల్లి స‌న్నిధిలో క‌లిసాం. గ‌తంలో మా భ‌వ‌నం నిర్మించడానికి చాలా తిరిగాం. ఆ రోజుల్లో ప‌డ్డ క‌ష్టం ఇంకా మ‌రిచిపోలేదు. అలాంటి మ‌న తెలుగు సినిమాకు ఏదైనా చేయాల‌నే తపనతో ప్రకాష్ రాజ్ వస్తే ఇదీ పరిస్థితి. ఆయ‌న నాన్ లోక‌ల్ అని తిట్ట‌డం క‌రెర్ట్ నా? ఎలక్షన్ జరిగే రోజు నరేష్.. నా ద‌గ్గ‌ర‌కి వ‌చ్చి.. ఒక్కొక్క ల** కొడుకుల సంగతి చూస్తా అన్నాడు. ‘మా’లో నా ఇష్టం అన్నారు.. ఇదా ఆయన ధోరణి”.

“నా భార్య పద్మ చావుబ్రతుకుల మధ్య ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతుంటే… మెగాస్టార్ చిరంజీవి సహా ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, బెనర్జీ ఇలా అందరూ నాతో హాస్పిటల్ లో ఉన్నారు. కానీ ఆ నరేష్ మాత్రం ఒక్క ఫోన్ కాల్… ఒక్కటంటే ఒక్కటి ఫోన్ కాల్ కూడా చెయ్యలేదు. నరేష్ అధ్యక్షుడి గా ఉన్నప్పుడు నేను ఈసీ మెంబర్ ని.. అలాంటిది నాకు ఒక్క ఫోన్ కాల్ చేసి పరామర్శించ‌లేదు. మా సభ్యులకు ఇంకేం పరామర్శ చేస్తావు ?” అని న‌రేష్ నిజ‌స్వ‌రూపాన్ని బ‌య‌ట పెట్టాడు.

“ఇక పోలింగ్ నాడు చిన్న యుద్ధమే జ‌రిగింది. నా జీవితంలో బెనర్జీ అన్న ఏడవడం ఎన్నడూ చూడలేదు.. అప్పుడు చూశా. పోలింగ్ రోజే మా పరిస్థితి ఇలా ఉంటే రేపు ఎలా ఉంటుంది. విష్ణు అన్న మేము లేకపోయినా నువ్వు నడపగలవు. మీ వెనుక నాన్న ఉన్నారు. ఆయ‌నే అని చూసుకుంటాడు”అని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version