మరోసారి తనదైన శైలిలో కౌంటర్ వేసిన ప్రకాశ్ రాజ్.!

-

నటుడు ప్రకాష్ రాజ్  వివాదాలతో సహవాసం చేస్తూ ఉంటారు. ఎక్కడ వివాదం ఉంటే అక్కడ ఆయన ఎంట్రీ ఇస్తారు. ఇక కేంద్ర ప్రభుత్వ విధానాల మీద, ఆ పార్టీ నాయకుల మీద ఆయన వంటి కాలి మీద లేస్తూ ఉంటారు.ప్రస్తుతం మరో సినిమా వివాదంలో కూడా వేలు పెట్టరుట్. ప్రస్తుతం షారుక్ ఖాన్ సినిమా పఠాన్ లో దీపిక పదుకొనె   సాంగ్ పై సోషల్ మీడియాలో నెటిజన్లు చెలరేగి పోతున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమాలో ధరించిన బట్టలు, రొమాన్స్ పై ఎందుకు ఇంత వివాదం అంతకు ముందు ఎన్ని సినిమాలలో ఇంతకంటే దారుణ మైన సీన్లు ఉన్న సినిమాలు రాలేదు, అంటూ సపోర్ట్ చేస్తున్న వారు కూడా ఉన్నారు. తాజాగా మధ్య ప్రదేశ్ హోమ్ మంత్రి నరోత్తమ్ మిశ్రా భేషరమ్ సాంగ్ ని డర్టీ మైండ్ తో చిత్రీకరించినట్లు ఉన్నారు. దీపికా పదుకొనె ధరించిన కాస్ట్యూమ్స్ చాలా అభ్యంతర కరంగా ఉన్నాయి అంటూ మిశ్రా వ్యాఖ్యానించారు.

ఇక ఇదంతా చూస్తూ ఉన్న ప్రకాష్ రాజ్ మరో సారి తన దైన శైలిలో కౌంటర్ ఇచ్చాడు.ప్రకాష్ రాజ్  ట్విట్టర్ ట్వీట్ చేస్తూ.. భేషరమ్ బిగోట్స్.. కాషాయం ధరించిన స్వామీజీలు మైనర్లని అత్యాచారం చేసినప్పుడు పట్టించుకోరు. అలాంటి స్వామీజీ లు, నాయకులు పబ్లిక్ గా తిరగొచ్చు.. అయినా ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ దీపికా పదుకొనె సినిమాలో కాస్ట్యూమ్ ధరించినప్పుడు మాత్రమే మీకు ఇబ్బందా ? ఇలాంటి సినిమాలు అంతకు ముందు రాలేదా అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇక దీనిపై మళ్లీ వారి కౌంటర్స్ ఎలా ఉంటాయో చూడాలి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version