పవన్ కళ్యాణ్ కి ప్రకాష్‌రాజ్ కౌంటర్.. ప్రతీ మాటకు సమాధానం చెబుతా..!

-

తిరుమల లడ్డు వివాదం ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఈ వివాదంలో నిలబడి సనాతన ధర్మం అంటూ పోరాడుతున్నారు. లడ్డు వివాదం పై ప్రకాశ్ రాజ్ పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి.. తప్పు జరిగి ఉంటే మీరే అధికారంలో ఉన్నారుగా విచారణ జరిపించండి. అంతే కానీ మీరెందుకు ఆందోళన వ్యాప్తి చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ సమస్యను దేశవ్యాప్తంగా ఎందుకు తీసుకెళ్తున్నారని.. దేశం ఇప్పటికే చాలా మతపరమైన గొడవలున్నాయని ట్వీట్ చేశారు.

ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. హిందువుల గురించి మాట్లాడితే.. ప్రకాశ్ రాజ్ కి సంబంధం ఏంటి..? ఏమైనా పిచ్చి పట్టిందా..? మీకు.. హిందువుల అవమానం జరగడం పై మాట్లాడటం తప్పా అని ప్రశ్నించారు. దీంతో పవన్ వ్యాఖ్యలు వైరలయ్యాయి. తాజాగా ముందు నుంచి కూడా ప్రకాశ్ రాజ్ బీజేపీకి, హిందువులకు మద్దతుగా మాట్లాడే వారి పై కౌంటర్లు వేస్తుంటారు. తాజాగా పవన్ కల్యాణ్‌కు ప్రకాష్‌రాజ్ కౌంటర్ వేశారు.  “నేను చెప్పిందేంటి, మీరు అపార్థం చేసుకుని తిప్పుతున్నదేంటి?.. నేను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్‌లో ఉన్నా.. ఈ నెల 30 తర్వాత వచ్చి మీ ప్రతి మాటకు సమాధానం చెబుతా.. మీకు వీలైతే నా ట్వీట్‌ను మళ్లీ చదవండి.. అర్థం చేసుకోండి ప్లీజ్ అంటూ ట్వీట్ చేశారు ప్రకాష్‌రాజ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version