కాంగ్రెస్ పై ప్రశాంత్ కిషోర్ షాకింగ్ కామెంట్స్.. ఆ పార్టీ లేకున్నా కూటమి ఉంటుందన్న పీకే

-

కాంగ్రెస్ పార్టీపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రముఖ ఎన్నికల స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్. ఇంతకుముందు కూడా ప్రశాంత్ కిషోర్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. తాజాగా కాంగ్రెస్ లేకున్నా కూటమి ఉంటుందని వ్యాఖ్యలు చేశారు పీకే. దేశంలో బీజేపీకి వ్యతిరేఖ ప్రతిపక్ష కూటమి కాంగ్రెస్ లేకున్నా ఏర్పాటు చేయవచ్చని అలన్నారు. 1984 తర్వాత కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా గెలవలేదని.. గత 10 ఏళ్లలో 90శాతం ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతుందని అన్నారు. ఇక గాంధీయేతర చెందిన వ్యక్తి ఆ పార్టీకి అధ్యక్షుడు అయితే పరిస్థితి మారుతుందని ఆయన అన్నారు. గతంలో కాంగ్రెస్ గురించి ఇలాంటి వ్యాఖ్యలే చేశారు ప్రశాంత్ కిషోర్. ఇటీవల ప్రతిపక్షాలకు సారథ్యం వహించడం కాంగ్రెస్ దైవత్వంగా భావిస్తుందని అన్నారు. దీనిపై కాంగ్రెస్ కూడా ఘాటుగానే స్పందించింది. కాంగ్రెస్ లేకుండా బీజేపీకి వ్యతిరేఖంగా కూటమి సాధ్యం కాదంటూ ఆపార్టీ నేతల పీకే వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.

మరోవైపు కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా త్రుణమూల్ కాంగ్రెస్ పార్టీని తీర్చిదిద్దేందుకు ప్రశాంత్ కిషోర్ తెరవెనుక నుంచి ప్రయత్నిస్తున్నారు. దీనికి అనుగుణంగానే బెంగాల్ ముఖ్యమంత్రి, త్రుణమూల్ అధినేత్రి మమతాబెనర్జీ దేశంలోని ప్రతిపక్ష పార్టీలను కూడగట్టే ప్రయత్నం చేస్తుంది. ఆమె ఇటీవల యూపీఏ ఎక్కడ ఉందంటూ.. కాంగ్రెస్ పార్టీని గురించి అన్నారు. జాగో బంగ్లా సంపాదకీయంలో కాంగ్రెస్ లేదని.. అసలైన కాంగ్రెస్ మాదే అంటూ త్రుణమూల్ గురించి వ్యాఖ్యానించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version