పెళ్లి అనేది ఈ జీవితంలో చాలా ముఖ్యమైనది. చిన్న చిన్న ఇబ్బందులు తరచూ భార్యాభర్తల మధ్య వస్తూ ఉంటే ఆ బంధం ఎంతకాలమొ నిలవదు ఒకవేళ కనుక మీరు ప్రేమించే వ్యక్తి లో ఈ లక్షణాలు ఉంటే మీరు వాళ్లకు దూరంగా ఉండడమే మంచిది. పెళ్లి దాకా అనవసరంగా తీసుకెళ్లి ఇబ్బంది పడొద్దు. అయితే మరి మీ బాయ్ ఫ్రెండ్ లో ఈ లక్షణాలు ఉంటే తప్పకుండా ఆ రిలేషన్ షిప్ కి స్వస్తి చెప్పడమే కరెక్ట్. మరి అవేమిటో ఇప్పుడు చూద్దాం.
ఆర్థిక భద్రత:
ఎంత జీతం ఉన్నా ఎంత బ్యాంకు బాలన్స్ ఉన్నా దానిని సరిగ్గా మెయింటైన్ చేసుకోవాలి. అలా కనుక మీ బాయ్ ఫ్రెండ్ చేసుకోకపోతే తప్పకుండా మీరు మరొకరిని వివాహం చేసుకోవడం బెస్ట్. ఎందుకంటే ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ అనేది చాలా ముఖ్యం.
అమ్మ మాట వినడం:
చాలామంది మగవారు అమ్మ కూచి అయి ఉంటారు. అటువంటి వాళ్ళకి దూరంగా ఉండడమే మంచిది. ఏమైనా అడిగితే అమ్మని అడగాలి అమ్మకి చెప్పాలి అంటూ ఉంటారు. అలాంటి వాళ్లు బాధ్యతగా ఉండరు కాబట్టి వాళ్లకు దూరంగా ఉండడమే మంచిది.
పనిలో బిజీగా ఉండటం:
ఎప్పుడూ పనులతో బిజీగా ఉంటూ కనీసం కాస్త సరదాగా ఉండలేకపోతున్నా వాళ్లకు దూరంగా ఉండడమే మంచిది.
ఎక్కువ కంట్రోల్ చేయడం:
మీరు ఏం చెప్పడానికి కూడా అవకాశం ఇవ్వకుండా ఎప్పుడూ కూడా అన్నీ వాళ్లే డిసైడ్ చేస్తుంటే వాళ్ళని పెళ్లి చేసుకోకండి.
నిజాయితీ లేకపోవడం:
నిజాయితీ లేకుండా ఉన్న వాళ్ళతో కూడా రిలేషన్షిప్ లో ఉండటం వేస్ట్. ఏ బంధమైనా ఆ కలకాలం నిలవాలంటే ఇద్దరి మధ్య నమ్మకం ఉండాలి అది లేకపోతే బంధం ఎందుకు.