సోనియా గాంధీతో ప్రశాంత్ కిషోర్ కీలక భేటీ

-

సోనియా గాంధీ నివాసంలో ఈ రోజు ( సోమవారం) కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రతిపాదనలను పరిశీలించేందుకు వేసిన ప్రత్యేక కమిటీతో సోనియా గాంధీ సమావేశం కానున్నారు. దీంతో పాటు ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ తో చేరికపై చర్చలు నిర్వహించనున్నారు. కెసి వేణుగోపాల్, దిగ్విజయ సింగ్, అంబికా సోని, రణదీప్ సూర్జేవాలా, జైరామ్ రమేష్, మరియు ప్రియాంక గాంధీ వాద్రా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఇటీవల  పీకే చేసి ప్రతిపాదనలపై కాంగ్రెస్ పార్టీ వేసిన కమిటీ నివేదికను సోనియాగాంధీ పరిశీలించారు. దీనిపై కాంగ్రెస్ సీనియర్ల అభిప్రాయాలను సోనియాగాంధీ తీసుకోనున్నారు. పీకే చేసిన ప్రతిపాదనలపై సోనియా గాంధీ తుదినిర్ణయం తీసుకున్నారు.

ఈ కమిటీలతో సోనియాగాంధీ చర్చించిన తర్వాత.. స్వయంగా సోనియాగాంధీతో పీకేతో సమావేశం కానున్నారు. కమిటీలతో చర్చించి విషయాలను,  అప్పగించాల్సిన బాధ్యతలను సోనియాగాంధీ, పీకేకు వివరించనున్నారు. పూర్తిగా పార్టీ పీకే చేతుల్లోకి వెళ్లిందనే అనుమానాలు రాకుండా… ఓ ప్రత్యేకమైన మెకానిజాన్ని రూపొందించనుంది కాంగ్రెస్ పార్టీ. అయితే పీకే చేరికపై కూడా కాంగ్రెస్ పార్టీ కొన్ని షరతులు విధించినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీలో చేరితే… ఇతర పార్టీలతో బంధాలను తెగదెంపులు చేసుకోవాలని కాంగ్రెస్ పీకేకు స్పష్టం చేసినట్లు తెలిసింది. ఇక కాంగ్రెస్ పార్టీలో చేరితే ప్రశాంత్ కిషోర్ కు ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version