ప్రశాంత్ నీల్ ఇండియన్ సినిమా వీరప్పన్: రామ్ గోపాల్ వర్మ

-

కన్నడ స్టార్ హీరో యాష్ తో కే జి ఎఫ్ 2 ని తెరకెక్కించి పాన్ ఇండియా లెవల్లో ఘన విజయాన్ని సాధించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ పై టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ప్రశంసలు కురిపించారు. దర్శకుల దినోత్సవం సందర్భంగా ప్రశాంత్ అనీల్ కు శుభాకాంక్షలు తెలిపిన వర్మ.. కే జి ఎఫ్ 2 సినిమాతో కన్నడ తో పాటు బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ దర్శకులకు కనువిప్పు కలిగించేలా చేశారని చెప్పారు.

రీ షూటింగులు, రీ డ్రాప్టులు పునరాలోచనలతో టన్నుల కొద్దీ డబ్బును వృధా చేస్తున్నారని.. వాళ్ళు వేస్ట్ చేసినంత డబ్బుతోనే మీరు క్వింటాల్ డబ్బు సంపాదించారని ప్రశంసించారు. సినీ పరిశ్రమలో సాంప్రదాయబద్ధంగా ఉండే 95 శాతం మందికి కే జి ఎఫ్ 2 నచ్చలేదని చెప్పారు. మీరు పాత ఇండస్ట్రీని బయటకు నెట్టివేసి, కొత్త పరిశ్రమకు జీవం పోశారని, దాని పేరే కేజిఎఫ్ 2 అని ప్రశంసించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version