బీఆర్ఎస్ నేతలను ఫుట్ బాల్ ఆడుకోవాలి : ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌

-

మరోసారి సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ ను ఇంటికి పంపే సమయం ఆసన్నమైందన్నారు. బీఆర్ఎస్ నేతలను ఫుట్ బాల్ ఆడుకోవాలన్నారు. దివ్యాంగులకు ప్రతినెల రూ.10 వేల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని అయిజలో బీఎస్పీ ఆధ్వర్యంలో దివ్యాంగుల భరోసా సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు.దివ్యాంగుల సమస్యలపై దృష్టి పెట్టని అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం, మాజీ ఎమ్మెల్యే సంపత్, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, మంత్రి నిరంజన్ రెడ్డి ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.

BRS నేతల మాదిరి కమీషన్లు తీసుకొని అడ్డగోలుగా సంపాదించడానికి తాను రాజకీయాల్లోకి రాలేదన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తాము పని చేయకపోతే రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పారు. బీసీలకు న్యాయం చేసే ఏకైక పార్టీ బీఎస్పీ మాత్రమేనని ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. 99 శాతం పేదలకు అధికారం దక్కాలనే బీఎస్పీ లక్ష్యంగా త్వరలోనే బీఎస్పీ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటిస్తామన్నారు. సోమవారం ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో బీసీలకు 60 నుంచి 70 సీట్లు కేటాయిస్తామని ప్రకటించారు. ఒకే దేశం – ఒకే ఎన్నికలు అనేది కేవలం బీజేపీ నినాదంగా మిగులుతుంది తప్ప.. భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్న దేశానికి జమిలి ఎన్నికలు ప్రయోజనకరం కాదన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version