హెల్త్ మినిస్టరీ: శ్వాస సమస్యలు తొలగిపోవాలంటే ఇంట్లో ప్రోనింగ్ చెయ్యండి…!

-

కోవిడ్ బారిన పడిన వాళ్ళు ఇళ్లల్లో ప్రోనింగ్ చేయడం మంచిది అని యూనియన్ హెల్త్ మినిస్టరీ చెప్పింది. దీనికి సంబంధించి క్లుప్తంగా డాక్యుమెంట్ ని విడుదల చేశారు. అసలు ప్రోనింగ్ అంటే ఏమిటి..?, దీని వల్ల ఆక్సిజనేషన్ ఎలా ఇంప్రూవ్ అవుతుంది అనేది ఇప్పుడు చూద్దాం…! రోజురోజుకీ కరోనా వైరస్ బారిన ఎంతో మంది పడుతున్నారు. డాక్టర్లు ఇంట్లో ఉండి ఆక్సిజన్ లెవల్స్ని సెల్ఫ్ మోనిటరింగ్ చేసుకోవడం మంచిదని చెప్పారు.

ఒకవేళ కనుక శ్వాస లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్లు ముఖాన్ని కింద పెట్టి ఈ విధంగా అనుసరిస్తే మంచిది.

ప్రోనింగ్ అంటే ఏమిటి…?

ముఖాన్ని కిందకు ఉంచి పాడుకోవడాన్ని ప్రోనింగ్ అని అంటారు. ఇలా ఈ పొజిషన్ లో ఉండడం వల్ల కంఫర్ట్ గా ఉంటుంది మరియు ఆక్సిజనేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అని హెల్త్ మినిస్టరీ చెప్పడం జరిగింది. ఒకవేళ కనుక ఆక్సిజన్ లెవెల్స్ 94 శాతం కంటే తక్కువ ఉంటే వాళ్లు ఇలా పడుకుని ఉండడం వల్ల వెంటిలేషన్ ఇంప్రూవ్ అవుతుంది.

ప్రోనింగ్ కోసం ఏమి కావాలి…?

దీని కోసం ఒక ఐదు తలగడలు కావాలి. ఒకటి మెడ కింద, చెస్ట్ కింద ఒకటి లేదా రెండు, తొడల కి సపోర్ట్ గా రెండు అలానే అవసరమైతే ఇంకొకటి ఉపయోగించుకోవచ్చు. ఇలా 30 నిమిషాలకు ఒకసారి పోసిషన్ మార్చాలి. బెల్లి నుండి పక్కల వరకు పొజిషన్ మార్చుకోవచ్చు.

ఎవరు ప్రోనింగ్ చేయకూడదు..?

గర్భిణీలు
కార్డియాక్ కండిషన్స్ తీవ్రంగా ఉండేవాళ్ళు.
స్పెయిన్ అన్ స్టేబుల్ గా ఉండే వాళ్ళు.
పెవిలిక్ ఫ్రాక్చర్స్ వుండేవాళ్ళు.

ఈ జాగ్రత్తలు కూడా ముఖ్యం:

తిన్న తర్వాత చేయకూడదు.
తీవ్ర పరిస్థితిలో ఉన్నప్పుడు చేయకూడదు.
రోజులో పదహారు గంటలు చేసుకోవచ్చు కాస్త గ్యాప్ ఇచ్చి అనుసరించవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version