గర్భిణి కడుపులో దెయ్యం పిల్ల… షాక్ అయిన డాక్టర్లు..!

-

గర్భం దాల్చిన ఓ అమ్మాయి. తన కడుపులో బిడ్డ ఎలా ఉందో , ఆడపిల్లా లేక మగపిల్లాడా చెక్ చేసుకోవడానికి హాస్పటల్ కి వెళ్ళింది. ఆమెని పరీక్షించిన వైద్యులు స్కానింగ్ చేయించడానికి తీసుకు వెళ్ళారు. స్కానింగ్ అవగానే ఆడా లేక మగా పిల్లాడా అని ఆత్రుతగా ఎదురు చూస్తున్న ఆమెకి దిమ్మతిరిగిపోయేలా రిపోర్ట్ వచ్చింది. ఆమె ఒక్కదానికే కాదు వైద్యులు సైతం ఆ రిపోర్ట్ చూసి షాక్ తిన్నారు.

ఇంతకీ ఆ రిపోర్ట్ లో ఏముందంటే…

ఎవరో ఫోటో తీస్తుంటే తీక్షణంగా చూస్తున్నట్టుగా స్కానింగ్ రిపోర్ట్ లో కనుగుడ్లు పెద్దగా చేసుకుని, జుట్టు నిక్కబొడుచుకుని ఉన్న ఓ దెయ్యం పిల్ల కనిపించింది. ఆ రిపోర్ట్ చూసిన గర్భిణి తన కడుపులో దెయ్యం పిల్ల ఉందంటూ తెగ కంగారు పడిపోయింది. ముందుగా వైద్యులు ఆలోచనలో పడినా అది దెయ్యం కాదు మీ పిల్లే మీకు ఆడపిల్ల అని సర్ది చెప్పారు.

కానీకడుపులో ఉన్న పిల్లలు కళ్ళు మూసుకునే ఉంటారు. తెరిచిన సందర్భాలు లేవు అలాంటప్పుడు తననే స్కాన్ చేస్తున్నారు అన్నట్టుగా చూడటం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే అదే హాస్పటల్ కి చెందిన పిల్లల వైద్య నిపుణులు గర్భిణికి సర్ది చెప్పారు. ఒక్కో సారి పిల్లలు కడుపులో ఉన్నా చూస్తారని ఇది అరుదుగా జరుగుతుంది తప్ప దెయ్యం పిల్ల కాదని తేల్చి చెప్పారు. దాంతో ఊరట చెందిన ఆమె ఆ రిపోర్ట్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వివరం చెప్పడంతో అది కాస్తా వైరల్ అయ్యింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version