దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన హత్రాస్ ఘటనపై బీజేపీ ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు వివాదాస్పదం అయ్యాయి. ఉత్తరప్రదేశ్ లోని బాలి నియోజకవర్గాన్కి చెందిన సురేంద్ర సింగ్ మాట్లాడుతూ, ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే అమ్మాయిల తల్లి దండ్రులు కూతుళ్ళకి సంస్కారాన్ని నేర్పాలని, దానివల్లనే ఇలాంటి పరిణామాలు ఆగిపోతాయని, ఇటువంటి విషయంలో ప్రభుత్వ పాలన ఏమీ చేయలని, సంప్రాదాయాలు, ఆచారాలు ఇంట్లో నేర్పితేనే ఇలాంటి ఘటనలు ఆగిపోతాయని చెప్పాడు.
19ఏళ్ళ దళిత బాలికపై జరిగిన సామూహిక అత్యచారం కారణంగా బాధితురాలు చావుతోపోరాడుతూ చివరికి మృత్యువు ఒడిలోకి చేరుకుంది. ఈ విషయమై ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహిళలకి రక్షణ ఇవ్వలేని ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని, యోగీ ఆదిత్యనాథ్ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలతో పాటు చాలా మంది వ్యతిరేక నినాదాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సురేంద్ర సింగ్ మాట్లాడిన మాటలు మరింత వివాదాస్పదం అయ్యాయి.