హైదరాబాద్ మహానగరంలో ఎక్కడ చూసినా కల్తీ వస్తువుల తయారీ ముఠా పెట్రేగిపోతున్నది. తాగే నీటి నుంచి తినే ఆహారం వరకు ప్రతీది కల్తీ చేస్తున్నారు. తాజాగా వంటింట్లో ఉపయోగించే అల్లం పేస్ట్‌ను కూడా కల్తీ చేస్తున్న ముఠాను పక్కా సమాచారం మేరకు ఫుడ్ సేఫ్టీ అధికారులు పట్టుకున్నారు. వారి నుంచి పెద్ద ఎత్తున కల్తీ అల్లం పేస్ట్ ను సీజ్ చేశారు.
ఈ ఘటన సికింద్రాబాద్‌లోని ఓల్డ్ బోయిన్‌పల్లిలో సోమవారం ఆలస్యంగా వెలుగుచూసింది. ‘సోనీ జింజర్ గార్లిక్ పేస్ట్’పేరిట 1,500 కిలోల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారుచేస్తున్న మహ్మద్ షఖీల్ అహ్మద్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అల్లం వెల్లుల్లి పేస్టులో అల్లంకు బదులు ప్రమాదకరమైన సిట్రిక్ యాసిడ్, ఉప్పు, పసుపు, వెల్లుల్లిని వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.ఈ కేసులో మహ్మద్ షఖీల్ అహ్మద్‌తో పాటు మరో 8 మందిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు.
pic.twitter.com/jmRD170ple యాసిడ్‌తో అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ :
సికింద్రాబాద్ ఓల్డ్ బోయిన్‌పల్లిలో ‘సోనీ జింజర్ గార్లిక్ పేస్ట్’ పేరిట 1500 కిలోల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారుచేస్తూ పట్టుబడ్డ మహ్మద్ షఖీల్ అహ్మద్. అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో అల్లంకు బదులు…
— Devika Journalist (@DevikaRani81) November 18, 2024