నేడు రాష్ట్రపతి ఎన్నికలు..ఏర్పాట్లు అన్ని పూర్తి

-

నేడు రాష్ట్రపతి ఎన్నికలు జరుగనున్నాయి. ద్రౌపది ముర్ము, యశ్వంత్ సిన్హా ల మధ్య ఈ పోటీ ఉండనుంది. ఇవాళ పోలీంగ్‌ ఉండగా.. జులై 25 న నూతన రాష్ట్రపతి పదవీ బాధ్యతలు స్వీకరణ ఉండనుంది. జులై 21 న ఓట్ల లెక్కింపు ఉంది. ఇక జూలై 24 తో ప్రస్తుత రాష్ట్రపతి రామనాధ్ కోవింద్ పదవీ కాలం ముగియనుంది.

పార్లమెంట్ భవనంలో నేడు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది పోలింగ్. 15 వ రాష్ట్రపతి ఎన్నికలకు గాను పార్లమెంట్ భవనం లో, దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో విస్తృత ఏర్పాట్లు చేశారు. ఎమ్.పిలు, ఎమ్.ఎల్.ఏల తో కలిపి మొత్తం ఓటర్ల సంఖ్య 4,809 ఉండగా… మొత్తం పార్లమెంట్ సభ్యుల సంఖ్య 776గా ఉంది.

ఢిల్లీ, పాండుచ్చేరి అసెంబ్లీ లతో సహా దేశంలోని అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ల సభ్యుల సంఖ్య 4,033 మంది ఉన్నారు. పార్లమెంటు ఉభయ సభలకు చెందిన ప్రతి సభ్యుని ఓటు విలువ 708 గా ఉంది. ఆయా రాష్ట్రాల్లో ఉన్న జనాభా , ఇతరత్రా అంశాల ఆధారంగా ఒక్కో రాష్ట్రంలో ఒక ఎమ్.ఎల్.ఏ విలువ నిర్ధారణ కాగా.. దేశంలో యు.పి ఎమ్.ఎల్.ఏ విలువ అత్యధికం….ఎమ్.ఎల్.ఏ విలువ 208 గా ఉంది. ఇక తెలంగాణలో ఈ ఓటింగ్‌ కు అన్ని ఏర్పాట్లు చేసింది ఎన్నికల సంఘం.

Read more RELATED
Recommended to you

Exit mobile version