సమంతపై ప్రియమణి హాట్‌ కామెంట్స్‌..నా భర్త కూడా..

-

టాలీవుడ్‌ సీనియర్‌ హీరోయిన్‌ ప్రియమణి తాజాగా నటించిన వెబ్‌ సిరీస్‌ భామాకలాపం. ఈ సినిమా తర్వలోనే ఆహాలో రిలీజ్‌ కానుంది. ఈ నేపథ్యంలో ఓ ఛానెల్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియమణి సంచలన వ్యాఖ్యలు చేశారు. సమంత నటించిన ఊ అంటావా ఐటమ్‌ సాంగ్‌ పైనే హాట్‌ కామెంట్స్‌ చేసింది ప్రియమణి. పుష్ప ఐటెం సాంగ్‌ లో చాలా హాట్‌ గా కనిపించిందని… తన భర్తే.. నాకు చెప్పాడంటూ పేర్కొంది.

బహుశా సమంత కెరీర్‌ లో ఇలాంటివి సమంత చేసి ఉండకపోవచ్చని వెల్లడించింది ప్రియమణి. ”ఈ ఐటెమ్‌ సాంగ్‌ ను చాలా మంది డౌన్‌ లోడ్‌ చేసి.. ఇప్పటికే రీల్స్‌ ను తయారు చేసిన ఉంటారని అనుకుంటున్నాను.. ఇది నంబర్‌ వన్‌ పాటగా నిలిచింది. ఇంత అద్భుతమైన పాటతో వచ్చినందుకు దేవి శ్రీ ప్రసాద్‌ కు హ్యాట్సాఫ్‌. కొరియేగ్రఫీ చాలా అందంగా ఉంది. ” అంటూ సమంత పై ప్రశంసలు కూడా కురిపించింది ప్రియమణి. ఇలాంటి పాత్రలు చేయడం చాలా గ్రేట్ అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version