మరో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోడీ. ఢిల్లీ నుంచి హిమాచల్ ప్రదేశ్ – ఉనాలోని అంబ్ అందౌరా స్టేషన్ వరకు ఈ రైలు నడవనంది. బుధవారం మినహా అన్ని రోజుల్లో సేవలు అందించనుండగా.. అంబాలా, చండీగఢ్, ఆనంద్ పూర్, సాహిబ్, ఉనా స్టేషన్లలో ఆగనుంది. ఈ కార్యక్రమానికి హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జయరాం ఠాగూర్, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా హాజరయ్యారు.
హిమాచల్ ప్రదేశ్ నుంచి నడిచే మొదటి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ఇదే కావడం విశేషం. దేశంలో ఇప్పటికే మూడు వందే భారత్ ట్రైన్లు నడుపుతుండగా.. ఇటీవల పశువులు ఢీకొనడం, సాంకేతిక కారణాలతో పలుమార్లు సేవలలో అంతరాయం ఏర్పడింది.
नई रफ्तार से आगे बढ़ रहा है नया भारत।
PM @narendramodi Ji flagged off the 4th #VandeBharat train from Una, Himachal Pradesh to New Delhi. pic.twitter.com/WeyogfSHt8
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) October 13, 2022