న్యూ ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద నేతాజీ సుభాస్ చంద్ర బోస్ హోలోగ్రామ్ విగ్రహాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అవిష్కరించారు. నేతాజీ సుభాస్ చంద్ర బోస్ 125 వ జయంతి సందర్భంగా ఇండియా గేట్ వద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. గ్రానైట్ రాయితో 25 అడుగుల ఎత్తు ఉన్న నేతాజీ సుభాస్ చంద్ర బోస్ ప్రతిమను ప్రతిష్టిస్తారు. ఈ విగ్రహాన్ని న్యూ ఢిల్లీ నేషనల్ మ్యూజియం ఆఫ్ మోడరన్ ఆర్ట్స్ తయారు చేస్తుంది.
అయితే ఈ గ్రానైట్ విగ్రహం తయారు అయ్యేంత వరకు హోలోగ్రామ్ విగ్రహాన్ని అవిష్కరించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ఈ రోజు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇండియా గేట్ వద్ద నేతాజీ సుభాస్ చంద్ర బోస్ హోలోగ్రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. నేతాజీ సుభాస్ చంద్ర బోస్ కు భారతదేశం రుణపడి ఉంటుందని ప్రధాని మోడీ అన్నారు. అందుకు ఉదహారణనే ఈ విగ్రహం అని అన్నారు. నేతాజీ పూర్తి స్థాయి విగ్రహం తయారు అయ్యే వరకు ఈ హలో హూలోగ్రామ్ విగ్రహం ఉంటుందని పీఎం మోడీ అన్నారు.