ప్రధాని మోడీ నామినేషన్ తేదీ ఫిక్స్

-

ప్రధాని నరేంద్ర మోడీ నామినేషన్ దాఖలు చేసే తేదీ ఫిక్స్ చేశారు. వారణాసి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మోడీ ఈ నెల 13వ తేదీన నామినేషన్ దాఖలు చేయనున్నారు.నామినేషన్ సందర్భంగా భారీ ర్యాలీగా వెళ్లి రిటర్నింగ్ అధికారికి ప్రధాని నామినేషన్ పత్రాలు సమర్పించనున్నారు.నరేంద్ర మోడీ నామినేషన్ కార్యక్రమం సందర్భంగా యూపీ బీజేపీ యూనిట్ అప్రమత్తమైంది. నామినేషన్ సందర్భంగా ఏర్పాటు చేసే ర్యాలీ, సభకు భారీ జనసమీకరణ చేసేందుకు ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది.

ప్రస్తుతం వారణాసి సిట్టింగ్ ఎంపీగా ఉన్న మోడీ మరోసారి అక్కడి నుండి బరిలోకి దిగుతోన్న సంగతి తెలిసిందే. ఇక, వారణాసిలో ప్రధాని మోడీపై యూపీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అజయ రాయ్ పోటీకి దిగుతున్నారు. వారణాసిలో పోలింగ్ జూన్ 1వ తేదీన చివరి దశలో జరగనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version