ఏపీలో ఈనెల 06, 08 తేదీలలో ప్రధాని మోడీ పర్యటన

-

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వేడి రసవత్తరంగా కొనసాగుతోంది. ముఖ్యంగా ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు. ఇటీవలే నామినేషన్ ప్రక్రియ సైతం ముగిసింది. ఈ నేపథ్యంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఏపీకి రానున్నారు. ఈనెల 06, 08 తేదీలలో మోడీ పర్యటన ఉన్నట్టు బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంక దినకర్ తెలిపారు. రెండో దశ ప్రచార పర్యటనలో భాగంగా ఈనెల 06న రాజమండ్రి, అనకాపల్లిలో బీజేపీ నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు.

ఈనెల 06న మధ్యాహ్నం రాజమండ్రి పార్లమెంట్ కి చేరుకుంటారు. 06న సాయంత్రం అనకాపల్లి పార్లమెంట్ కి వస్తారు. కూటమిలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కలిసి రాజమండ్రి, అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో నిర్వహించే సభలో మోడీ పాల్గొంటారు. ఈనెల 08న ఉదయం రాజంపేట పరిధిలో పీలేరు సభలో.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లతో కలిసి ప్రసంగిస్తారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో కలిసి 08న సాయంత్రం 4 గంటలకు విజయవాడలో 2.5 కిలోమీటర్ల రోడ్డు షో నిర్వహించనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version