కరోనా వైరస్ వచ్చే మంగళవారం తో ముగుస్తున్న నేపధ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని లాక్ డౌన్ కొనసాగించే విషయంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభిప్రాయం తీసుకున్నారు. రెడ్ జోన్ కి మాత్రమే కరోనా లాక్ డౌన్ ని పరిమితం చెయ్యాలి అనే విషయాన్ని జగన్ ప్రధాని దృష్టికి తీసుకుని వెళ్ళారు.
మాల్స్, సినిమాహాళ్లు, ప్రార్థనామందిరాలు అదే విధంగా ప్రజారవాణా, పాఠశాలలపై లాక్‌డౌన్ కొనసాగించాలని జగన్ అభిప్రాయపడ్డారు. ఇక ఈ సందర్భంగా లాక్ డౌన్ వలన నష్టాలను, ప్రజలు పడుతున్న కష్టాలను, రైతులు, వలస కూలీలు, ఇతర కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన వివరించారు. రాష్ట్రంలో కరోనా కట్టడికి తీసుకునే చర్యలను ఆయన ప్రధాని దృష్టికి తీసుకుని వెళ్లి ఆర్ధిక పరిస్థితిని వివరించారు.
కరోనా పాజిటివ్ కేసులు ఉన్న ప్రాంతాల్లో కంటైన్‌మెంట్ వ్యూహం కొనసాగుతోందని ప్రధానికి జగన్ వివరించారు. 676 మండలాల్లో 37 మండలాలు రెడ్‌జోన్‌లో ఉన్నాయన్న జగన్… 44 మండలాలు ఆరెంజ్ జోన్‌లో ఉన్నాయని… గ్రీన్ జోన్‌లో ఉన్న 595 మండలాల్లో కరోనా ప్రభావం లేదని పేర్కొన్నారు. 141 కంటైన్‌మెంట్ క్లస్టర్లను హాట్‌స్పాట్‌లుగా గుర్తించామని వివరించారు. క్రిటికల్ కేర్ కోసం 4 అత్యాధునిక ఆస్పత్రులు ఏర్పాటు చేశామని చెప్పారు జగన్.
13 జిల్లాల్లో కోవిడ్ ఆస్పత్రులను ఏర్పాటు చేసుకున్నామన్న ఆయన అదనంగా 78 ఆస్పత్రులను ఏర్పాటు చేసుకుంటున్నామని… ప్రతి జిల్లాలో కరోనా కేర్ సెంటర్లను ఏర్పాటు చేసుకున్నామని ప్రధానికి జగన్ వివరించారు. క్వారంటైన్ కోసం 26వేల బెడ్స్ సిద్ధంగా ఉన్నాయన్న ఆయన… రాష్ట్రవ్యాప్తంగా 1.4 కోట్లకుపైగా ఉన్న కుటుంబాలను, వారి ఆరోగ్యాన్ని క్రమం తప్పకుండా పరిశీలిస్తున్నామని…
కరోనా లక్షణాలు ఉన్నవారిని గుర్తించి వారికి పరీక్షలు చేసి, వారికి వైద్యం అందిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. వాలంటీర్ వ్యవస్థ గురించి జగన్ వివరించారు. ఏపీలో 2,61,216 గ్రామ, వార్డు వాలంటీర్లు, 40వేల మంది ఆశ వర్కర్లు, 20,200 మంది ఏఎన్‌ఎంలు ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని జగన్ పేర్కొన్నారు. కరోనా లక్షణాలు ఉన్నవారిని గుర్తించి వారికి పరీక్షలు చేసి, వారికి వైద్యం అందిస్తున్నామని ప్రధానికి జగన్ వివరించారు. చివరిగా మీరు ఎం చెప్తే అదే చేస్తామని, అదే వ్యూహం తో కరోనాను ఎదుర్కొంటామని అన్నారు.