వాళ్ళు అందుకే వద్దంటున్నారు: మోడీ ఫైర్

-

వ్యవసాయ బిల్లులపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు కురిపించారు. దేశంలో రైతులు తమ పంటను ఎక్కడైనా అమ్ముకోవచ్చని స్పష్టం చేశారు. రైతుల సంక్షేమం కోసమే కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును తీసుకు వచ్చిందని ఆయన పేర్కొన్నారు. తాము తీసుకువచ్చిన ఈ బిల్లులతో రైతులకు అన్ని విధాలుగా లాభం చేకూరుతుందని అన్నారు. వ్యక్తిగత స్వార్థంతోనే కొందరు బిల్లును వ్యతిరేకిస్తున్నారని ఆయన ఆరోపించారు .

ఇష్టం వచ్చిన విధంగా రైతులు తమ ఉత్పత్తులను  అమ్ముకోవచ్చని అని ఆయన వ్యాఖ్యానించారు. రైతులకు ఈ సంస్కరణలు అవసరమని ప్రధాని చెప్పుకొచ్చారు. ఇప్పటిదాకా రైతులకు పూర్తి స్థాయిలో లాభాలు అందలేదని అన్నారు. పంట పొలాలకు ఈ బిల్లులు రక్షణ కల్పిస్తామని చెప్పారు. రైతులకు సాంకేతిక అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కేవలం రైతుల గురించి ఆలోచించి మాత్రమే ఈ బిల్లును తీసుకు వచ్చాం అని అన్నారు. రైతుల ఉత్పత్తులకు మెరుగైన లాభాలు వస్తాయని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version