ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఏడాది తొలిసారిగా విదేశీ పర్యటనకు వెళ్లి బోతున్నారు.మే 2 నుంచి మూడు రోజుల పాటు రోజుల పాటు ఆయన విదేశాల్లో పర్యటించనున్నారు.తొలుత ఆయన జర్మనీ కి వెళ్లనున్నారు.అక్కడి నుంచి డెన్మార్క్ వెళతారు.తిరుగు ప్రయాణంలోమే 4వ తేదీన ప్యారిస్ కు చేరుకుంటారు.ఈ మేరకు మోడీ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.బేర్లిన్ లో జర్మనీ ఫెడరల్ చాన్సలర్ ఓలాప్ షోల్స్ తో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు.ఇండియా జర్మనీ ఇంటర్- గవర్నమెంటల్ కన్సల్టేషన్(IGC)6 వ ఎడిషన్లో ప్రధాని మోదీ జర్మనీ ఫెడరల్ ఛాన్సలర్ ఓలాఫ్ షోల్స్ పాల్గొననున్నారు.
ఈ సమావేశంలో రష్యా -ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం గురించి మూడు దేశాల నేతలతో చర్చించనున్నట్లు తెలుస్తోంది.అనంతరం డెన్మార్క్ ప్రధాని ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ కోపెన్ హగన్ వెళ్లనున్నారు.అక్కడ డెన్మార్క్ ప్రభుత్వం ఆతిథ్యమిస్తున్న రెండవ ఇండియా నార్దిక్ సమ్మిట్ లో మోదీ పాల్గొననున్నారు.ఈ సదస్సులో ఐస్ల్యాండ్, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్ దేశాల ప్రధాన మంత్రుల తో మోదీ చర్చించనున్నారు.కరోనా అనంతరం ఆర్థిక పరిస్థితులు, వాతావరణ మార్పులు, నూతన ఆవిష్కరణలు, పునరుత్పాదక ఇంధన వనరులు, ప్రపంచ భద్రత వంటి అంశాలు ఈ భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది.