ట్రెండ్ ఇన్: ‘ప్రిన్స్’ పాటల పర్వం..అనుదీప్, శివ కార్తీకేయన్, థమన్‌ల తర్జన భర్జన!

-

ఒకే ఒక్క సినిమాతో స్టార్ డైరెక్టర్ అయిపోయారు అనుదీప్ కేవీ. ‘జాతి రత్నాలు’ పిక్చర్ తో అనుదీప్ చాలా ఫేమస్ అయ్యారు. ఆయన నెక్స్ట్ ఫిల్మ్ కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తీకేయన్ తో తీస్తున్నారు. ఈ చిత్ర విడుదల తేదీని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు మేకర్స్.

దీపావళి కానుకగా ‘ప్రిన్స్’ ఫిల్మ్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.ఈ క్రమంలోనే త్వరలో ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయబోతున్నారు. ఇందుకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ జరిగాయి. ఈ ఫొటోలను ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు.

prince shiva karthikeyan thaman anudeep

#Prince ప్రిన్స్ అనే హ్యాష్ ట్యాగ్ తో మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.థమన్, హీరో శివ కార్తీకేయన్, డైరెక్టర్ అనుదీప్ కేవీ ఫొటోలు షేర్ చేశారు. అలా ఆ ఫొటోలు మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ లో వరుసగా షేర్ చేశారు నెటిజన్లు. దాంతో సదరు హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో కొద్ది సేపు ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఈ సినిమా నుంచి త్వరలో ఫస్ట్ సింగిల్ విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఉక్రెయిన్ భామ మరియా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. కాగా, ఈ చిత్రం కూడా జనాలను ఎంటర్ టైన్ చేసే విధంగా ఉంటుందని మేకర్స్ చెప్తున్నారు. పిక్చర్ లో సత్యరాజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. తెలుగు, తమిళ్ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version