“ప్రిన్స్” ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముగ్గురు స్టార్లు

-

శివ కార్తికేయన్.. కోలీవుడ్ యంగ్ హీరో గా గుర్తింపు తెచ్చుకున్న శివ కార్తికేయన్ తాను నటించిన సినిమాలను తెలుగులో కూడా రిలీజ్ చేస్తూ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.. డాక్టర్ బాబు, డాన్ వంటి సినిమాలతో మరింత పాపులారిటీని సొంతం చేసుకున్న శివ కార్తికేయన్ నేరుగా తెలుగులో నటిస్తున్న సినిమా ప్రిన్స్.. ఇక ఈ సినిమాను ఒకేసారి తెలుగు, తమిళ్ భాషలో విడుదల చేయబోతున్నారు.

ఈ చిత్రాన్ని తెలుగులో అక్టోబర్ 21వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా తమిళంలో గ్రాండ్ జరిగింది. కాగా తెలుగులోనూ ఈ ఈవెంట్ ను గ్రాండ్ గా జరపడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది. ఇవాళ జరగనున్న ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు విజయ్ దేవరకొండ, హరీష్‌ శంకర్‌ మరియు దగ్గుబాటి రానా చీఫ్ గెస్ట్ గా రానున్నట్లు చిత్ర బృందం అధికారిక ప్రకటన రానుంది. ఈ ఈవెంట్‌ ఇవాళ JRC Conventionలో 6 pm గంటలకు ప్రారంభం కానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version