విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ నిలిపి వేయాలి : బీవీ. రాఘవులు

-

ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరించాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ. రాఘవులు డిమాండ్ చేశారు. రెండు రోజుల పాటు నిర్వహించిన సీపీఎం సమావేశాలు ఈరోజు(శనివారం)తో ముగిశాయి. అయితే నాయకులు పలు తీర్మానాలు చేశారు. ఈ సమావేశాల్లో సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ. రాఘవులు,ఎం. ఏ. బేబి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీవీ రాఘవులు మాట్లాడుతూ… ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించేలా పాలకులపై ఒత్తిడి తేవాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ నిలిపి వేయాలని సీఎం చంద్రబాబు నాయుడు, ప్రధాని మోదీని ఒప్పించాలని తీర్మానించారు. ఉపాధి హామీ చట్టానికి నిధులు పెంచాలని, బకాయిలు వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర బడ్జెట్‌లో రూ. 2 లక్షల కోట్లు కేటాయించి పట్టణ ప్రాంతాలకు విస్తరించాలని విజ్ఞప్తి చేశారు. టీడీపీ ప్రకటించిన సూపర్ 6 హామీలను సత్వరమే అమలు చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. ప్రస్తుత ప్రభుత్వం జీపీఎస్ఐ రిలీజ్ చేసిన గెజిట్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version