వింక్ బ్యూటీగా పేరుపొందింది ప్రియా ప్రకాష్ వారియర్.. ఈమె సినిమాలలో ఎంట్రీ ఇవ్వకముందే ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం ఒక చిన్న కన్ను గీటి వీడియోని విడుదల చేయడంతో బాగా పాపులర్ అయ్యింది. అలా పాపులర్ అయిన కొద్ది రోజులకే సెలబ్రిటీగా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ. ప్రియా వారియర్ మలయాళం లో మొదట నటించిన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశపరిచింది. అయినా కూడా సోషల్ మీడియాలో ఈమె క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఆ తర్వాత తెలుగులో కూడా నితిన్ తో చెక్ సినిమాలో నటించినా.. పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇక తర్వాత రెండు సినిమాలలో నటించినా.. అవి కూడా నిరాశనే మిగిల్చాయి.
దీంతో ప్రియా వారియర్ సోషల్ మీడియాలో తన అందాల ఆరబోతున్న చేస్తూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ వున్నది.ఇక ఈ మధ్యకాలంలో బికినీ ఫోటోలు, క్లీవేజ్ అందాలతో మళ్లీ వార్తల్లో నిలుస్తోంది. బికినీలో ఈ ముద్దుగుమ్మ చూపు తిప్పుకోలేనంతగా తన అందాలను ప్రదర్శించిందని పలువురు నెటిజన్ల సైతం కామెంట్స్ చేస్తూ ఉన్నారు. తాజాగా ఈ క్రమంలోనే చాలా పద్ధతిగా చీరకట్టులో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. దీంతో ఈ ఫోటోలు చూసిన ఈమె అభిమానులు అప్పుడేమో బికినీలో ఇప్పుడేమో చీర కట్టులో మతులు పోగొడుతున్నావ్ ప్రియా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ప్రియ వారియర్ నిజంగానే చీరకట్టులో చాలా అందంగా కనిపిస్తోంది. మరీ ఇంత అందగత్తెకు ఆఫర్లు ఎందుకు రావడం లేదు అంటూ పలువురు నెటిజన్లు తెలియజేస్తున్నారు. చీర కట్టులో స్కిన్ షో చేయకుండా కూడా చూపు తిప్పుకొని అందంతో ప్రియ వారియర్ అభిమానులను ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈమెకు సంబంధించి సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. మరి రాబోయే రోజులలో ఆఫర్లు అందుకుంటుందేమో ఈ ముద్దుగుమ్మ చూడాలి.