సీఎం జగన్ కీలక నిర్ణయం, ఆ కుటుంబానికి రూ. 2000 పరిహారం

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. వరద బాధిత కుటుంబానికి రూ. 2000 సిద్ధం అయ్యారు. తాజాగా అనంతపురంలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. వర్షాలు, వరదల కారణంగా నిర్వాసితులైన వారికి అండగా నిలవాలని అధికారులను ఆదేశించారు.

cm jagan

బాధిత కుటుంబాలకు తక్షణసాయంగా రూ. 2000 చొప్పున అందించాలని సూచించారు. నిత్యావసర సరుకులు అందించాలన్నారు. వర్షాలు, వరదలు తగ్గుముఖం పట్టగానే ఆస్తి, పంట నష్టం వివరాలు అంచనా వేసి, పరిహారం అందించాలని జగన్ ఆదేశించారు.

కాగా, గత అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి అనంతపురం అతలాకుతలమైంది. కాలనీలు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నగరంలోని 12 కాలనీలు, రుద్రంపేట పంచాయతీలోని ఐదు కాలనీలో జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. నడిమివంకకు వరదనీరు పోటెత్తడంతో కాలనీల్లో ఐదడుగుల మేర నీరు చేరుకుంది. ఫలితంగా ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం కష్టంగా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version