కారులో ‘దళితబంధు’ చిచ్చు.. మునిగేలా ఉన్నారు?

-

కేసీఆర్ ఏది చేసిన అందులో రాజకీయం లేకుండా ఉండదు..ఏదో ప్రజల కోసం అన్నట్లు చెబుతారు గాని..ఆయన చేసే ప్రతి కార్యక్రమం వెనుక రాజకీయం ఉంటుంది. ఆ రాజకీయంతోనే దళితబంధు కార్యక్రమాన్ని తీసుకొచ్చారని చెప్పొచ్చు. హుజూరాబాద్ ఉపఎన్నికలో ఈటల రాజేందర్‌ని ఓడించడానికి..దళితుల ఓట్లని టీఆర్ఎస్‌కు పడేలా చేసుకోవాలని చెప్పి..ఒక్కో దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వడానికి కేసీఆర్ సిద్ధమయ్యారు. మొదటగా హుజూరాబాద్ దళితులకు ఈ కార్యక్రమం అమలు చేశారు

TRS-Party | టీఆర్ఎస్

అయితే దళితబంధు హుజూరాబాద్‌లో వర్కౌట్ అవ్వలేదు..అక్కడ టీఆర్ఎస్ ఓడిపోయింది. ఎన్నిక అయ్యాక దళితబంధుకు బ్రేక్ పడింది..దీంతో టీఆర్ఎస్‌పై విమర్శలు పెరిగాయి. ఈ క్రమంలోనే ఇటీవల దళితబంధుని మళ్ళీ మొదలుపెట్టారు..వచ్చే మార్చిలో ప్రతి నియోజకవర్గంలో వంద కుటుంబాలకు దళితబంధు అందజేయాలని కేసీఆర్ చెప్పారు. కాకపోతే నియోజకవర్గంలో వంద దళిత కుటుంబాలని ఎంపిక చేయడం అనేది పెద్ద ఇబ్బంది..వేల మందిలో వంద మందిని ఎంపిక చేయడం పెద్ద తలనొప్పి.
ఈ క్రమంలోనే వంద మందిని ఎంపిక చేయడం ఎమ్మెల్యేలకు కొత్త తలనొప్పి తీసుకొచ్చింది. ఏది చేసినా వంద మందికే బంధు ఇవ్వాలి..దీంతో ఎమ్మెల్యేలు ఎవరికి ఇవ్వాలా? ఇప్పించాలా? అని నానా తంటాలు పడుతున్నారు.

అయితే టీఆర్ఎస్ నేతల ఇష్టప్రకారమే వంద మంది కుటుంబాల ఎంపిక జరుగుతోంది. ఇప్పుడు ఎమ్మెల్యేలకు తెలిసిన వాళ్లు, పార్టీ కోసం పని చేసిన దళిత నేతలు, పెద్ద ఎత్తున సిఫార్సులు తీసుకువస్తున్నారు. దీంతో ఎవరికి పథకం ఇవ్వాలనేది ఎమ్మెల్యేలకు అర్ధం కావడం లేదు. ఒకరికిస్తే..ఒకరు అలుగుతారు. కొంతమంది అయితే తమకు ఎందుకు ఇవ్వడం లేదని గొడవ చేస్తున్నారు. తాజాగా వికారాబాద్ ఎమ్మెల్యే తమకు కావల్సిన వాళ్ళకే పథకం ఇవ్వడంపై మిగిలిన దళిత కుటుంబాలు ఆందోళన చేశాయి.

దీంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు దళితబంధుతో ఇబ్బంది ఎదురవుతుంది..ఇప్పుడు ఒకరికి దళితబంధు ఇస్తే..వందమంది వ్యతిరేకమయ్యేలా ఉన్నారు. మొత్తానికి ఈ దళితబంధుతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొంపమునిగేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version