వావ్ వావ్ : సైనికుల భ‌వంతిలో దెయ్యాల క‌వాతు!

-

ఉత్తరప్రదేశ్ లోని చాలా నగరాల్లో మీరట్ (Meerut) నగరం. చెప్పాలంటే ఇది నేషనల్ కేపిటల్ రీజన్ (NCR)లో భాగం. ఈ నగరం ఆధునిక హంగులు అద్దుకుంటూ క్రమంగా అభివృద్ధి చెందుతోంది. మౌలిక వసతులకల్పన కూడా కొనసాగుతోంది..అయితే ఇదే నగరానికి ప్రాచీన చరిత్ర కూడా ఉంది. ఇప్పటికీ మీరట్ లోని ఓల్డ్ సిటీ… ప్రాచీన జ్ఞాపకాలను గుర్తుచేస్తుంది. కొన్ని హంటెడ్ ప్లేసెస్ గా గుర్తింపు పొందుతున్నాయి. అక్కడ దెయ్యాల కథలున్నాయి. చాలా మంది వాటి గురించి రకరకాలుగా చెబుతారు. ముఖ్యంగా మీరట్ లోని జీపీ బ్లాక్ (GP Block) అలాంటిదే. ఈ బ్లాక్ లో మూడు భవనాలు ఉంటాయి. కొన్ని దశాబ్దాలుగా వాటిలో ఎవరూ నివసించట్లేదు. వీటి వెనుక కొన్ని హర్రర్ స్టోరీస్ ఉన్నాయి..అవేంటో ఒక్కటిటిగా చూద్దాం.

1950లో ఓ మహిళ జీపీ బ్లాక్ లోని ఓ భవనంలో కూర్చొని కనిపించిందట. ఆమె నిండుగా ఎరుపు రంగు డ్రెస్ వేసుకుందని చెబుతారు. అచ్చం దెయ్యం లాంటి ఆకారంలో ఆమె ఉందని స్థానికులు అంటారు. ఆమె ఒక్కసారి కాదు… చాలాసార్లు కనిపించిందనీ, తమవైపు కోపంగా చూసిందని కొందరు అంటారు. అందుకు ఆధారాలు మాత్రం ఎవరూ చూపించలేకపోయారు. కానీ స్థానికుల్లో ఆ మహిళ పట్ల విపరీతమైన భయం మాత్రం అలాగే ఉంది.

ఒకసారి..ఆ బ్లాక్ లోని ఓ భవనం రూఫ్ టాప్ పై నలుగురు వ్యక్తులు కూర్చొని మద్యం తాగుతున్నట్లు స్థానికులకు కనిపించారట. వారు చెప్పింది లెక్కలోకి తీసుకుంటే… ఆ సమయంలో భవనాల్లోకి ఎవరూ వెళ్లే ఛాన్సే లేదు. మరి ఆ నలుగురూ ఎవరు? మనుషులా? దెయ్యాలా? స్థానికులేమో వాళ్లు దెయ్యాలే అంటున్నారు. దెయ్యాలైతే పైన కూర్చొని సిట్టింగ్ వెయ్యాల్సిన పనేంటి. మనుషుల లాగా దెయ్యాలు మందేస్తాయా? స్థానికులు మాత్రం మనుషులు వెళ్లే అవకాశం లేనప్పుడు కనిపించారు కాబట్టి వాళ్లు దెయ్యాలే అని బలంగా అంటున్నారు.

జీపీ బ్లాక్ అనేది ప్రైవేట్ వ్యక్తులది కాదు. అది ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్ కి చెందినది. అందువల్ల మొదట్లో ఈ భవనాలను ఆర్మీ అధికారులు సబ్ ఏరియా ఆఫీసుగా ఉపయోగించుకున్నారు. ఐతే… 1950లో ఈ భవనాలను ఖాళీ చేశారు. ఆ తర్వాత ఓ జూనియర్ ఆఫీసర్ ఈ భవనాల్లో దిగాడు. వాటిని తన ఇల్లులుగా భావించాడు. కొన్నాళ్లకు అతను కూడా ఖాళీ చేసేశాడు. అతను వెళ్లిపోయాక అధికారికంగా ఎవరూ ఆ ఇళ్లలో దిగలేదు. ఆ తర్వాత ఆర్మీ కొంతమంది కేర్ టేకర్లను నియమించింది. మూడు ఇళ్లలో గ్రౌండ్ ఫ్లోర్లలో వారిని ఉంచింది. ఐతే… వాళ్లు కుదురుగా ఉండకుండా… ఆ భవనాలను కొత్త జంటలకు, పేకాటరాయుళ్లకు తాత్కాలికంగా గంటల లెక్కన అద్దెకు ఇవ్వడం మొదలుపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న ఆర్మీ… కేర్ టేకర్లను ఉద్యోగాల నుంచి తీసేసి.. ఆ తర్వాత కంటోన్మెంట్ బోర్డు… జీపీ బ్లాక్ ఎంట్రన్స్ దగ్గర ఐరన్ గేట్ ఏర్పాటు చేసింది.

దెయ్యాల కథలపై పరిశోధనలు:

జీపీ బ్లాక్ ని దెయ్యాల అడ్డాగా ఆర్మీ ఎప్పుడూ చెప్పలేదు. కానీ దశాబ్దాలుగా దాన్ని పట్టించుకోవడం మానేసేసరకి అది భూత్ బంగళాగా మారింది..దెయ్యాలపై పరిశోధనలు చేసేవాళ్లు మాత్రం రకరకాల పరికరాల్ని తీసుకెళ్లి… అక్కడ పరిశోధనలు చేస్తుంటారు. కానీ ఎవరికీ కచ్చితంగా దెయ్యాలున్నట్లు ఆధారాలు దొరకలేదు. కానీ ఎక్కువమందిని ఆ రెడ్ డ్రెస్ మహిళ కథ ఆకర్షిస్తోంది. ఆమెను కనుక్కోవడానికి అప్పుడప్పుడూ పరిశోధకులు వెళ్తున్నారు. ఇలాంటి పరిస్థితులు, కల్పిత కథల వల్ల ఈ ప్రదేశం ఇండియాలోని హంటెడ్ ప్లేస్ లలో ఒకటిగా నిలిచింది.

– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version