అర్జున్ రెడ్డి భామ‌ని అందుకే క‌ట్ చేసారా?

-

అర్జున్ రెడ్డి హిట్ తో టాలీవుడ్ కి ఉవ్వెత్తున దూసుకొచ్చింది షాలిని పాండే. తొలి సినిమానే బ్లాక్ బ‌స్ట‌ర్. బోల్డ్ గా పెద‌వి ముద్దుల‌తో చిచ్చ‌ర పిడుగులా రెచ్చిపోయింది. పెద‌వి ముద్దుల‌కే కొత్త అర్ధాన్ని తీసుకొచ్చింది. కానీ అమ్మ‌డు కెరీర్ టాలీవుడ్ లో ఆశించినంత‌గా సాగ‌లేదు. ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు, మ‌హాన‌టి లాంటి సినిమాల్లో న‌టించినా ఆమెకంత గుర్తింపు రాలేదు. చెప్పాలంటే హీరోయిన్ గా అవ‌కాశాలే రాలేదు. దీంతో కోలీవుడ్ పై దృష్టి పెట్టింది. అక్క‌డ మాత్రం కెరీర్ సాఫీగానే సాగుతోంది. ప్ర‌స్తుతం అక్క‌డ నాలుగైదు సినిమాల్లో న‌టిస్తోంది. తెలుగు ప్ర‌య‌త్నాలు పెద్ద‌గా చేసిన‌ట్లు కూడా లేదు. అయితే అర‌కొర‌గా వ‌చ్చిన అవ‌కాశాలు మాత్రం వ‌దులుకుంటుంద‌ని తెలుస్తోంది.

Producers Fair On shalini pandey

ద‌ర్శ‌కుల‌కు సినిమాలో త‌న పాత్ర అలా ఉండాల‌ని..ఇలా ఉండాల‌ని కండీష‌న్లు పెడుతుందిట‌. పారితోషికం కూడా తాను అడిగినంత ఇవ్వాల త‌ప్పా బేర‌సారాలు ఆడితే కుద‌ర‌ద‌ని క‌రాకండీగా చెప్పేస్తోందిట‌. ఈ రెండింటికీ మించి తాను కేటాయించిన డేట్ల‌ల‌లోనే షూటింగ్ పెట్టుకోవాల‌ని త‌ల‌తిక్క కండీష‌న్ పెట్టిందిట‌. అందుకే అమ్మ‌డికి టాలీవుడ్ ప‌క్క‌న‌బెట్టింద‌న్న విష‌యం ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు తొలి రెండు కండీష‌న్ల‌కు ఒప్పుకున్నా మూడ‌వ కండీష‌న్ విష‌యంలో మాత్ర రాజీ ప‌డేదే! లేద‌ని మేము చెప్పినట్లు నువ్వు వింటావా? నువ్వు చెప్పిన‌ట్లు మేము వినాలా? అని నీ అవ‌స‌రమే మాకు లేదంటూ ఓ నిర్మాత గ‌ట్టిగా ఇచ్చాడుట‌. అందువ‌ల్లే షాలిని బాగోతం బ‌య‌ట ప‌డిన‌ట్లు తెలుస్తోంది.

ఒక్క హిట్ కే అంత బిల్డ‌ప్ కొడితే ఎలా అమ్మ‌డు?. అందుకేమో తెలుగులో అంత పెద్ద హిట్ ఉన్నా! కోలీవుడ్ కే ప‌రిమిత‌మైంది. అర్జున్ రెడ్డి త‌ర్వాత రెండు హిందీ సినిమాలు చేసి కోలీవుడ్ కే పరిమిత‌మైంది. ప్ర‌స్తుతం అక్క‌డ మూడు సినిమాలు చేస్తోంది. అలాగే అనుష్క ప్ర‌ధాన పాత్ర పోసిస్తోన్న సైలెన్స్ లోనూ ఓ కీల‌క పాత్రకు ఎంపికైన‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. ఈ విష‌యాన్ని యూనిట్ ధృవీక‌రిస్తే గానీ న‌టిస్తుందా? లేదా? అన్న‌ది క్లారిటీ రాదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version