KGF Chapter2: రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటించిన ‘కె.జి.యఫ్ – 1’ ఎంత సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే. బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తూ కలెక్షన్ల సునామీ సృష్టించింది ‘కె.జి.యఫ్’ మూవీ. ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో హోంబలే ఫిలింస్ నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 250 కోట్లు వసూలు చేసి.. రికార్డులను తిరగ రాసింది. దక్షిణభారతంలో ‘బాహుబలి’ తర్వాత ఆ స్థాయి గుర్తింపు
సాధించిన చిత్రం కేజీఎఫ్. దేశవ్యాప్తంగా అద్భుత వసూళ్లు సాధించింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వ ప్రతిభకు యావత్ సినీ లోకం ఫిదా అయింది.
ఆ చిత్రం భారీ విజయం సాధించడంతో సీక్వెల్ గా ‘కె.జి.యఫ్ చాప్టర్ 2’ ఫ్లాన్ చేశారు ప్రశాంత్ నీల్. చాప్టర్ 1ను మించి ఉండేలా.. . అంచనాలకు తగ్గట్లుగా భారీగా బడ్జెట్ తో చాప్టర్ 2 ను నిర్మిస్తున్నారు. దీంతో షూటింగ్ జరుగుతుండగానే ఈ సినిమాపై ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి. షెడ్యూల్ ప్రకారం..ఈ సినిమా గత ఏడాదిలోనే విడుదల కావాల్సింది.
కానీ కరోనా కారణంగా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు వాయిదా పడుతూ వచ్చాయి. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని కె.జి.యఫ్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తోంది. అయితే ఇది పాన్ ఇండియా సినిమా కావడంతో దేశం యావత్తు థియేటర్స్ ఓపెన్ అయినప్పుడే సినిమాను విడుదల చేద్దామని నిర్మాతలు వేచి ఉన్నారంట.
ప్రస్తుతం పరిస్థితులు సాధారణ స్థాయికి రావడంతో కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తూ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేసింది చిత్ర యూనిట్. వచ్చే ఏడాది ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఈ మూవీని విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు.
బాలీవుడ్ స్టార్ సంయ్ దత్, రవీనాటాండన్, ప్రకాశ్‌రాజ్‌ను కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గత కొన్నినెలల క్రితం విడుదలైన ఈ సినిమా టీజర్‌పై ఓ రికార్డ్‌ను సెట్ చేసింది. మరి వచ్చే ఏడాది ఏప్రిల్ 14న రానున్న ‘కె.జి.యఫ్ ఛాప్టర్ 2’ వసూళ్ల పరంగా ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందో వేచి చూడాలి.